జో రూట్‌ను త్వరగా అవుట్ చేయాలంటే, అతన్ని సరిగ్గా వాడుకో... విరాట్ కోహ్లీకి పనేసర్ సలహా...

Published : Aug 22, 2021, 04:42 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో భారత ఫాస్ట్ బౌలర్లు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు. అయితే వారికి చిక్కకుండా పరుగుల వరద పారించాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్... జో రూట్‌ను త్వరగా అవుట్ చేసేందుకు జస్ప్రిత్ బుమ్రాను సరిగ్గా వాడుకోవాలంటూ సూచించాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మౌంటీ పనేసర్...

PREV
19
జో రూట్‌ను త్వరగా అవుట్ చేయాలంటే, అతన్ని సరిగ్గా వాడుకో... విరాట్ కోహ్లీకి పనేసర్ సలహా...

తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన జో రూట్, రెండో ఇన్నింగ్స్‌లో 109 పరుగులతో సెంచరీ చేసి ఇంగ్లాండ్‌ను ఓటమి నుంచి కాపాడాడు...

29

రెండో టెస్టులో మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమైన చోట 180 పరుగులు చేసి అజేయంగా నిలిచిన జో రూట్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 33 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు...

39

నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 386 పరుగులు చేసిన జో రూట్, 128.66 సగటుతో అదరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. బ్యాటింగ్‌లో జో రూట్, బౌలింగ్‌లో జేమ్స్ అండర్సన్ మాత్రమే రాణిస్తుండడం ఇంగ్లాండ్ జట్టును ఇబ్బంది పెడుతున్న విషయం...

49

‘జో రూట్‌ను త్వరగా అవుట్ చేయాలంటే... ఐదో స్టంప్ లైన్‌ని టార్గెట్ చేస్తూ బంతులు వేయాలి.. అలాగే ఆఫ్ స్టంప్ అవతల బంతులు వేస్తూ అతన్ని ఇబ్బంది పెట్టాలి... రెండో ఇన్నింగ్స్‌లో ఈ ప్లాన్ బాగా వర్కవుట్ అయ్యింది...

59

బుమ్రా పక్కా ప్లానింగ్‌తో జో రూట్‌ను అవుట్ చేశాడు. ఇది అతని పర్ఫామెన్స్‌పై ప్రభావం చూపొచ్చు. జో రూట్‌ బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు బుమ్రాతో ఇలాంటి బంతులు వేయిస్తూ ఉంటే, అతని త్వరగా అవుట్ చేయొచ్చు...

69

రోహిత్ శర్మలాగే జో రూట్ కూడా పుల్ షాట్ బాగా ఆడతాడు. కాబట్టి అతనికి షార్ట్ పిచ్ బంతులు వేయకూడదు... అలా వేస్తే అతను బౌండరీలు బాదుతూ... క్రీజులో కుదురుకుపోతాడు..

79

బుమ్రా, సిరాజ్ ఇద్దర కూడా బ్యాట్స్‌మెన్‌ను బాగా ఇబ్బంది పెట్టగలరు. వరల్డ్ బెస్ట్ టెస్టు బ్యాట్స్‌మెన్లలో జో రూట్ కూడా ఒకడు. జో రూట్‌ను అవుట్ చేయాలంటే, అతనితోనే తప్పు చేయించాలి...

89

పరుగులు రాకపోతే ఏ బ్యాట్స్‌మెన్ అయినా ఒత్తిడికి గురవుతాడు. అయితే జో రూట్ విషయంలో అలా జరగడం లేదు. షార్ట్ పిచ్ బంతులు వేస్తూ, రూట్‌కి బౌండరీలు సమర్పిస్తున్నారు భారత బౌలర్లు..

99

ఆ తప్పు చేయకుండా గేమ్ ప్లాన్ ప్రకారం బౌలింగ్ వేస్తే... అతను తన పొజిషన్ మార్చుకుంటాడు. షాట్స్ ఆడేందుకు ప్రయత్నించి, వికెట్ సమర్పించుకున్నాడు...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మౌంటీ పనేసర్...

click me!

Recommended Stories