డ్వేన్ బ్రావో‌కి ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్, ఒక్కోసారి ఒక్కో గర్ల్‌ఫ్రెండ్‌తో వస్తాడు... దీపక్ చాహార్ కామెంట్..

Published : Aug 22, 2021, 04:00 PM IST

క్రికెట్‌ని, జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో విండీస్ ప్లేయర్లకు తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలీదు. అందులోనూ డ్వేన్ బ్రావో లైఫ్ స్టైల్ కూడా మరో లెవెల్. అతని లైఫ్ స్టైల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు సీఎస్‌కే ప్లేయర్ దీపక్ చాహార్...

PREV
17
డ్వేన్ బ్రావో‌కి ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్, ఒక్కోసారి ఒక్కో గర్ల్‌ఫ్రెండ్‌తో వస్తాడు... దీపక్ చాహార్ కామెంట్..

శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండో వన్డేలో 69 పరుగులతో అదరగొట్టి, టీమిండియా విజయంల కీలక పాత్ర పోషించాడు దీపక్ చాహార్. అంతకుముందు ఐపీఎల్ 2021 సీజన్‌లో బాల్‌తో అదరగొట్టాడు దీపక్ చాహార్...

27

ఏడు మ్యాచుల్లో 8 వికెట్లు తీసిన దీపక్ చాహార్, 4/13 పర్ఫామెన్స్... ఐపీఎల్ కెరీర్‌లో ఉత్తమ గణాంకాలు నమోదుచేసుకున్నాడు... ప్రసుతం దుబాయ్‌లో సీఎస్‌కే క్యాంపులో ఉన్న దీపక్ చాహార్, కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

37

‘నేను క్రిస్‌గేల్‌కి చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఆయన్ని కలిసినప్పుడు, గేల్ నాకు మొబైల్‌లో తన ఇంటి ఫోటోలను చూపించాడు. గేల్ ఇంటిపైన స్విమ్మింగ్ పూల్ ఉంది... ఆ ఫోటోలో తన భార్యతో పాటు చాలామంది ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్స్ కూడా ఉన్నారు...

47

అప్పుడు నేను ఆతృతగా ‘ఇందులో మీ భార్య కూడా ఉంది. మీరు ఇలా గర్ల్ ఫ్రెండ్స్‌తో తిరిగితే ఏమనుకోదా?’ అని అడిగా... తను ఆవిడేం అనుకోదని చెప్పాడు. నాకు ఆశ్చర్యమేసింది...

57

మా జట్టులో డ్వేన్ బ్రావోకి ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. అతనికి ముగ్గురితోనూ పిల్లలు కూడా ఉన్నారు. ఆ ముగ్గురిలో ఎవ్వరినీ బ్రావో పెళ్లి చేసుకోలేదు...

67

ఐపీఎల్‌లో ఒక్కో సీజన్‌కి ఓ గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకొని వస్తాడు.. మా జట్టులోని ప్లేయర్లు అందరూ బ్రావోని చూసి కుళ్లుకుంటూ ఉంటారు... ’ అంటూ చెప్పుకొచ్చాడు దీపక్ చాహార్...

77

డ్వేన్ బ్రావోకి పెళ్లి కాలేదు, అయితే ముగ్గురి గర్ల్‌ఫ్రెండ్స్ కారణంగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన డ్వేన్ బ్రావో, తన కెరీర్‌లో 130 ఐపీఎల్ మ్యాచులు ఆడి 1510 పరుగులు చేశాడు, బౌలింగ్‌లో 156 వికెట్లు తీశాడు.

click me!

Recommended Stories