
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 4-1 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్ సంజు శాంసన్ బ్యాటింగ్ దారుణంగా ఉంది. అతని నుంచి భారీ ఇన్నింగ్స్ లను ఆశించారు. కానీ ఫలితం రాలేదు. సంజు శాంసన్ 5 మ్యాచ్‌ల్లో కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. ఈ 5 మ్యాచ్‌ల్లోనూ అతను ఒకే రకమైన షాట్ పిచ్‌పై ఔటయ్యాడు.
అంటే మొదటి మూడు మ్యాచ్‌లలో ఆర్చర్ వేసిన షార్ట్ పిచ్‌లకు, 4వ మ్యాచ్‌లో మమ్మత్ వేసిన షార్ట్ పిచ్‌లకు, 5వ మ్యాచ్‌లో మార్క్ వుడ్ వేసిన షార్ట్ పిచ్ బంతులకు సంజూ శాంసన్ ఔట్ అయ్యాడు. సంజూ ఇలాంటి బంతులను ఆడుతూ నేరుగా ఫీల్డర్ చేతిలో కొట్టి పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. ఈ 5 మ్యాచ్‌లలో అతను ఒక్క ఆటలోనూ షాట్-పిచ్ బంతితో చేసిన తప్పుల దిక్కుకునే ప్రయత్నం చేయలేదు.
ఈ సిరీస్‌లో సంజూ శాంసన్ తనకు లభించిన ప్రతి అవకాశాన్ని వృధా చేసుకున్నాడని చెప్పాలి. అతను ఇప్పటికే టెస్ట్‌లు, వన్డేల టీమ్ లో చోటుకోల్పోయాడు. ఇప్పుడు అతను టీ20 మ్యాచ్‌ల్లో పేలవంగా ఆడుతున్నందున, అతను భారత జట్టులోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇంగ్లాండ్ వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీలో సంజు శాంసన్ లేడు. సంజూను జట్టులోకి తీసుకోకపోవడంతో చాలా మంది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అయితే, ఇప్పుడు సంజూ ఫామ్ చూసి అతనిపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు.
ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన భారత మాజీ కెప్టెన్, మాజీ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా సంజూ శాంసన్ ను టార్గెట్ చేశాడు. అతనికి ఇగో ఎక్కువంటూ హాట్ కామెంట్స్ చేశారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో శ్రీకాంత్ మాట్లాడుతూ, "ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో బాగా బ్యాటింగ్ చేయడంలో విఫలమైన తర్వాత సంజు శాంసన్ భారత జట్టులోకి రావడం కష్టం" అని అన్నారు.
Abhishek Sharma: యువరాజ్ సింగ్ కోరిక అదే.. సెంచరీ తర్వాత పెద్ద రహస్యం చెప్పాడు !
అలాగే, "ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ వరుసగా 5వ సారి అదే షాట్‌తో ఔటయ్యాడు. అతను తన అహాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అతను ఎన్నిసార్లు షార్ట్ బాల్ లో అవుట్ అయినా, 'వద్దు, వద్దు, నేను ఈ షాట్ ఆడతాను' అని తన అహంకారంతోనే వెళ్ళాడు. అతను తన అహంకార యాత్రకు వెళ్తున్నాడా? లేక భారత జట్టులో స్థానం కోసం పోరాడుతున్నాడా? ఇది తెలియదంటూ" ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
"ఈ సిరీస్‌లో సంజూ శాంసన్ వరుసగా 5వ సారి అదే షాట్‌తో ఔటయ్యాడు. అతను తన అహాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అతను ఎన్నిసార్లు షార్ట్ బాల్ లో అవుట్ అయినా.. అదే తరహా షాట్ ను ఆడుతున్నాడు. దానిని నుంచి ఏం నేర్చుకోవడం లేదు. అతనికి అహం ఎక్కువతోనే ఇలా ఆడాడు" అని కామెంట్స్ చేశాడు.
"ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి అతన్ని ఎందుకు ఎంపిక చేయలేదని మనం ఇదివరకు మాట్లాడుకున్నాము. అది చాలా చాలా బాధాకరం విషయం... నేను నిరాశ చెందాను. కానీ ఇప్పుడు సంజూ శాంసన్ ఆడుతున్న తీరును చూస్తే అతనికి నమస్తే చెప్పి ఇంటికి పంపేయవచ్చు. అలాగే, యశస్వి జైస్వాల్ తిరిగి వచ్చాడు. ఇక నుంచి అతను టీ20 మ్యాచ్ లు కూడా ఆడుతూనే" ఉంటాడని కృష్ణమాచారి శ్రీకాంత్ చెప్పాడు.
Abhishek Sharma: టీ20ల్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ
సంజూ శాంసన్ ఫామ్ లో లేకపోవడం తనను కలవరపెడుతోందని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. ప్రస్తుతం అతను ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గం కనుక్కోవడం చాలా ముఖ్యమైన విషయమని చెప్పాడు. ప్రతిసారి ఒకేరకమైన బాల్ కు ఔట్ అవుతుంటే దానిని అధిగమించే ట్రిక్స్ ను నేర్చుకోవాలని తెలిపారు. సంజూ శాంసన్ ఈ విషయంలో మనస్సు పెట్టాలని సూచించాడు.
ఇంగ్లాండ్ పై టీ20 సిరీస్ ను గెలిపించిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పై ప్రశంసలు కురిపించాడు అశ్విన్. "సూర్యకుమార్ యాదవ్ చాలా అనుభవజ్ఞుడైన వ్యక్తి. అతనికి చాలా సామర్థ్యం ఉంది. అతను భారత బ్యాటింగ్‌లో మార్పు తీసుకొచ్చాడని, దారి చూపించాడని చెప్పవచ్చు. కానీ అతను కొంత సమయం కేటాయించి తన విధానాన్ని మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది" అని ఆయన అన్నాడు.