వారి ప్లేస్‌లో నేనున్నా అలాగే చేస్తా, మాట్లాడడం మానేసి బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టండి... వీవ్ రిచర్డ్స్ కామెంట్!

First Published Mar 1, 2021, 4:25 PM IST

గత రెండు టెస్టు మ్యాచుల్లో కనీస పోరాటం కూడా చూపించకుండానే చేతులు ఎత్తేసింది ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు. రెండో టెస్టులో 317 పరుగుల భారీ తేడాతో ఓడిన ఇంగ్లాండ్, మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 112, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో పిచ్‌పైన తీవ్రమైన విమర్శలు వచ్చాయి...

ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌తో పాటు, హెడ్ కోచ్, ఇంగ్లాండ్ క్రికెటర్లు, బ్రిటీష్ మీడియా కూడా మొతేరా పిచ్ నాసిరకంగా ఉందని, టెస్టులు నిర్వహించేందుకు ఇది ఏ మాత్రం తగినది కాదని విమర్శలు గుప్పించారు. పిచ్ నాణ్యతను నిర్ణయించాల్సిందిగా ఐసీసీకి ఫిర్యాదు కూడా చేశారు...
undefined
పిచ్‌పై రోజురోజుకీ విమర్శలు పెరుగుతుండడంతో వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ వీవ్ రిచర్డ్స్, ఇంగ్లాండ్ జట్టుకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు... ‘సోషల్ మీడియాలో చాలామంది నన్ను, ఇండియా- ఇంగ్లాండ్ మధ్య టెస్టు జరిగిన పిచ్ గురించి అడుగుతున్నారు... బ్రిటీష్ మీడియాలో అయితే టీమిండియా పిచ్‌ల గురించి చాలా రకాల కథనాలు ప్రసారం అవుతున్నాయి...
undefined
ఇక చాలు... ఇలాంటి వృథా చర్చలు అన్నీ ఆపండి. ఇంగ్లాండ్ వెళ్లింది, న్యూజిలాండ్‌కో, లేక ఆస్ట్రేలియాకో కాదు... స్పిన్ పిచ్‌లు ఉండే భారతదేశానికి. స్పిన్‌కి అనుకూలించే పిచ్‌లు ఉండే దేశంలో పర్యటిస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా శిక్షణ తీసుకోవాలి...
undefined
స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోనేలా ప్రాక్టీస్ చేయాలి... పిచ్‌కి తగ్గట్టుగా బ్యాట్స్‌మెన్ తయారుకావాలి... అంతేకాని స్పిన్ బౌలింగ్‌లో ఆడలేనప్పుడు పిచ్‌ను నిందించడం ఏ మాత్రం సరికాదు...’ అంటూ వీడియో సందేశంలో ఇంగ్లాండ్ జట్టుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు వీవ్ రిచర్డ్స్..
undefined
‘టీమిండియాలో నేను ఉన్నా, రెండో టెస్టు, మూడో టెస్టు జరిగిన పిచ్‌లాంటి వికెట్‌కే నాలుగో టెస్టు కోసం కూడా రూపొందిస్తాను. ఎందుకంటే ప్రత్యర్థి జట్టును ఇబ్బంది పెట్టేందుకు అన్ని రకాల అస్త్రాలను ప్రయోగించాల్సి ఉంటుంది. అదే గేమ్‌ లక్షణం...
undefined
ఇంగ్లాండ్ టీమ్, మొదటి టెస్టులో చాలా సౌకర్యవంతంగా బ్యాటింగ్ చేసింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకే ఆలౌట్ అయిన ఎఫెక్ట్ వారిపైన పడ్డట్టుగా ఉంది. అందుకే రెండు, మూడో టెస్టుల్లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ అభద్రతా భావంలోకి వెళ్లారు.
undefined
నాకు తెలిసి ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టుకు భారత స్పిన్నర్ల గురించి ఓ అవగాహన వచ్చి ఉంటుంది. ఏ స్పిన్ బౌలర్‌ను ఎలా ఎదుర్కోవాలో హోంవర్క్ చేస్తే, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. స్పిన్ వికెట్‌కి తగ్గట్టుగా బ్యాట్స్‌మెన్ కూడా మానసికంగా సిద్దమైతే సరి’ అంటూ చెప్పుకొచ్చాడు వీవ్ రిచర్డ్స్.
undefined
click me!