ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిన తర్వాత నెల రోజులు బ్రేక్ తీసుకుని, వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరింది భారత జట్టు. వాస్తవానికి డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత ఆఫ్ఘాన్‌తో సిరీస్ ఆడాల్సింది టీమిండియా...
టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఆఫ్ఘాన్‌తో సిరీస్ ఆడేందుకు బీసీసీఐ ఇష్టపడలేదు. దీంతో గత ఏడాది జరగాల్సిన ఆఫ్ఘాన్ సిరీస్, ఈసారి కూడా వాయిదా పడింది... అయితే వెస్టిండీస్ పర్ఫామెన్స్, టీమిండియాని కొత్త చిక్కుల్లో పడేసింది...
26
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్, క్వాలిఫైయర్స్‌లో కూడా జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ వంటి అసోసియేట్ దేశాల చేతుల్లో చిత్తుగా ఓడి, వరల్డ్ కప్ టోర్నీకి దూరమైంది...
36
వరల్డ్ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్‌తో సిరీస్ ఆడబోతుండడం టీమిండియాకి ఇరకాటంలోకి నెట్టనుంది. ఇప్పుడు టీమిండియా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చినా దాన్ని ఏ మాత్రం లెక్క చేయరు ఫ్యాన్స్..
46
Team india vs West Indies
జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ వంటి చిన్న టీమ్స్‌పైనే ఓడిపోయిన వెస్టిండీస్‌ని ఓడించడం, ఆ టీమ్‌పై సెంచరీలు బాదడం కూడా గొప్పేనా? అని తేలిగ్గా తీసి పడేస్తారు...
56
ఒకవేళ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో ఫెయిలైన వెస్టిండీస్, ఆ కసితో స్వదేశంలో చెలరేగి టీమిండియాని ఓడిస్తే... భారత జట్టు పరువు గంగపాలు అవుతుంది. స్కాట్లాండ్ వంటి చిన్న జట్టు చేతుల్లో ఓడిన వెస్టిండీస్‌పైనే ఓడతారా? అంటూ టీమిండియా పరువు తీసి పడేస్తారు ఫ్యాన్స్..
66
India vs West Indies
మొత్తానికి సునీల్ గవాస్కర్ చెప్పినట్టు ఇప్పుడు వెస్టిండీస్ టూర్ వల్ల టీమిండియాకి ఒరిగిందేమీ లేదు. గెలిచినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు, ఓడితే మాత్రం చీల్చి చెండాడేస్తారు.. అదీకాకుండా వెస్టిండీస్ కాలమానం భారత కాలమానానికి చాలా వ్యత్యాసం ఉండడంతో ఈ సిరీస్‌కి పెద్దగా వ్యూయర్‌షిప్ కూడా రాకపోవచ్చు..