ఐపీఎల్ 2024లో పాక్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్... రూట్ క్లియర్ చేసుకుని, వచ్చేందుకు..

Published : Jul 03, 2023, 06:13 PM IST

ఐపీఎల్‌లో పాకిస్తాన్ క్రికెటర్లకు అనుమతి లేదు. 2008 ఐపీఎల్‌లో కొందరు పాక్ ప్లేయర్లు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్నా ఆ తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోవడంతో పాక్ ప్లేయర్లపై ఐపీఎల్‌లో నిషేధం విధించారు...

PREV
16
ఐపీఎల్ 2024లో పాక్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్... రూట్ క్లియర్ చేసుకుని, వచ్చేందుకు..

వరల్డ్ రిచెస్ట్, బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్‌లో ఆడలేకపోతున్నామనే బాధతో పీఎస్‌ఎల్ (పాక్ సూపర్ లీగ్)ని ప్రపంచంలో తోపు లీగ్‌గా చెప్పుకుంటూ డబ్బా కొట్టుకుంటూ ఉంటారు పాక్ క్రికెటర్లు, మాజీలు... అయితే 16 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఆడేందుకు ఓ పాక్ ప్లేయర్ (మాజీ) అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాడు..

26

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్‌లను అవుట్ చేసిన మహ్మద్ అమీర్, పీసీబీ అధికారులతో గొడవపడి... 2020 డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు...

36
Mohammad Amir

2016లో బ్రిటిష్ యువతి, లాయర్ నర్జీస్ ఖాన్‌ని వివాహం చేసుకున్న మహ్మద్ అమీర్, ప్రస్తుతం ఆమెతో కలిసి ఇంగ్లాండ్‌లోనే ఉంటున్నాడు. 2020లో ఇంగ్లాండ్‌కి మకాం మార్చిన మహ్మద్ అమీర్, బ్రిటీష్ పాస్‌పోర్ట్‌తో పాటు సిటిజన్‌షిన్ పొందేందుకు అర్హత సాధించాడు...

46

‘నేను పాకిస్తాన్ తరుపున క్రికెట్ ఆడాను. కాబట్టి ఇంగ్లాండ్ తరుపున క్రికెట్ ఆడాలని అనుకోవడం లేదు. ఐపీఎల్ గురించి ఇంకా ఆలోచించలేదు. దానికి ఇంకా ఏడాది సమయం ఉంది. ఇప్పటికైతే ఒక్కో అడుగు వేయాలని అనుకుంటున్నా..

56

రేపు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు, అలాంటప్పుడు 2024 ఐపీఎల్‌లో ఆడాలని ఇప్పటి నుంచే కలలు కనడం కరెక్ట్ కాదేమో.. నా పాస్‌ పోర్ట్ వచ్చాక నాకు వచ్చిన బెస్ట్ అవకాశాన్ని వాడుకోవాలని అనుకుంటున్నా.. ’ కామెంట్ చేశాడు పాక్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్....

66

పాకిస్తాన్ తరుపున 36 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20 మ్యాచులు ఆడిన మహ్మద్ అమీర్, మొత్తంగా 259  అంతర్జాతీయ వికెట్లు తీశాడు. 2010లో స్పాట్ ఫిక్సింగ్ కోసులో ఆరోపణలు ఎదుర్కొన్న అమీర్, ఐదేళ్ల తర్వాత 2015లో తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు. 

click me!

Recommended Stories