IPL 2020: బ్రియాన్ లారాకి ఈ ఆరుగురు ప్లేయర్లు తెగ నచ్చేశారుట... లిస్టులో సన్‌రైజర్స్ ప్లేయర్లు!

First Published Nov 9, 2020, 5:55 PM IST

IPL 2020 సీజన్‌లో యంగ్ ప్లేయర్లు అదరగొట్టారు. అండర్ 19 ప్లేయర్లు ప్రియమ్ గార్గ్, రవి బిష్ణోయ్ నుంచి దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న క్రికెటర్లు ఎందరో క్రికెట్ ప్రపంచాన్ని తమ ప్రదర్శనతో ఆశ్చర్యపరిచారు. తాజాగా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా... తనకు బాగా నచ్చిన ఆరుగురు యంగ్ క్రికెటర్ల ప్లేయర్లను ప్రకటించాడు.

టెస్టు క్రికెట్‌లో 400 స్కోరును అందుకున్న ఒకే ఒక్క క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన బ్రియాన్ లారా... ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు.
undefined
బ్రియాన్ లారాకు బాగా నచ్చిన ప్లేయర్లలో మొట్టమొదట యంగ్ క్రికెటర్ సంజూ శాంసన్. ఐపీఎల్‌ 2020 సీజన్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు సంజూ శాంసన్... 14 మ్యాచుల్లో 375 పరుగులు చేశాడు.
undefined
సీజన్‌లో 26 సిక్సర్లు బాదిన సంజూ శాంసన్ గురించి మాట్లాడుతూ... ‘సంజూ టైమింగ్, బ్యాటింగ్ భలే ఉంటుంది. అందుకే సంజూ బ్యాటింగ్ చూడడానికి ఇష్టపడతాను. కచ్ఛితంగా భవిష్యత్తులో మంచి క్రికెటర్ అవుతాడితను’ అంటూ వ్యాఖ్యానించాడు లారా.
undefined
సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్న ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ పేరును ప్రస్తావించాడు లారా. ముంబై ఫైనల్ చేరడంలో సూర్యకుమార్ పాత్ర కూడా చాలా ఉందని చెప్పిన లారా, అతన్ని వన్‌డౌన్‌లో ఆడించాలని చెప్పాడు....
undefined
2020 సీజన్‌లో 15 మ్యాచులు ఆడిన సూర్యకుమార్ యాదవ్... 461 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్‌ను ఆసీస్ టూర్‌కి ఎంపిక చేయకపోవడంపై సెలక్టర్ల తీరుపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
undefined
మొదటి సీజన్‌లో అద్భుతంగా అదరగొడుతున్న దేవ్‌దత్ పడిక్కల్‌ను పొగడ్తల్లో ముంచెత్తాడు బ్రియాన్ లారా. ‘దేవ్‌దత్ ఆటను చూసి ఆశ్చర్యపోయాను. అతనిలో చాలా టాలెంట్ ఉంది. అయితే జట్టులోకి రావాలంటే అతను కొన్ని విషయాలను మార్చుకోవాలి...
undefined
ఎందుకంటే దేవ్‌దత్ పడిక్కల్ కేవలం వన్డేలు, టీ20లకే పరిమితం కాకూడదు. టెస్టుల్లో కూడా రాణించాలి. అందుకు ఈ యంగ్ ప్లేయర్లు కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలి’... అంటూ చెప్పుకొచ్చాడు లారా.
undefined
ఈ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి కెప్టెన్‌గా వ్యవహారించిన కెఎల్ రాహుల్ రోజురోజుకీ తెగ నచ్చేస్తున్నాడని చెప్పుకొచ్చారు బ్రియాన్ లారా. ‘కేఎల్ రాహుల్ చాలా టాలెంటెడ్ ప్లేయర్. అతని గురించి ఇంకేం చెప్పగలను’ అంటూ చెప్పుకొచ్చాడు లారా.
undefined
ఐపీఎల్ 2020 సీజన్‌లో 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్న కెఎల్ రాహుల్, ఆసీస్ టూర్‌లో టీ20, వన్డే జట్టులకి వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించబోతున్నాడు.
undefined
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తరుపున ఆడుతున్న యంగ్ ప్లేయర్, అండర్ 19 టీమిండియా కెప్టెన్ ప్రియమ్ గార్గ్‌లో చాలా సామర్థ్యం ఉందని చెప్పిన బ్రియాన్ లారా... అతను ఫ్యూచర్‌లో మంచి ప్లేయర్ అవుతాడని చెప్పాడు.
undefined
జమ్మూ కాశ్మీర్ నుంచి ఐపీఎల్ ఆడుతున్న మూడో ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన యంగ్ ఆల్‌రౌండర్ అబ్దుల్ సమద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు బ్రియాన్ లారా.
undefined
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ అబ్దుల్ సమద్... చాలా తేలికగా సిక్సర్లు కొట్టే విధానం చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పాడు బ్రియాన్ లారా.
undefined
click me!