మొదటి టెస్టు తర్వాత స్వదేశానికి విరాట్ కోహ్లీ... వన్డే, టీ20లకు రోహిత్ శర్మ దూరం...

First Published Nov 9, 2020, 4:54 PM IST

IPL 2020 సీజన్ ఫైనల్ మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియా టూర్ కోసం బయలుదేరి వెళ్లనుంది భారత జట్టు.. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులతో పాటు నాలుగు టెస్టులను ఆడనుంది విరాట్ సేన. ముందుగా అనుకున్నట్టుగానే ఆస్ట్రేలియా సిరీస్‌లో రెండు టెస్టు మ్యాచులకు దూరం కాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ.
విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రస్తుతం గర్భవతి అనే సంగతి తెలిసిందే... వీరికి వచ్చే జనవరిలో బిడ్డ పుట్టబోతోంది...

ఐపీఎల్‌లో దుబాయ్‌ చేరిన విరాట్ కోహ్లీ, తన వెంటే సతీమణి అనుష్క శర్మను కూడా తీసుకెళ్లాడు... ఆర్‌సీబీ ఆడిన ప్రతీ మ్యాచ్‌కి హాజరై భర్తను ఉత్సాహపరిచింది అనుష్క.నవంబర్ 27 నుంచి మొదలయ్యే ఆస్ట్రేలియా సిరీస్‌కి కూడా అనుష్క శర్మతో పాటు వెళ్లాలని భావించాడు భారత సారథి విరాట్ కోహ్లీ...
undefined
అయితే బయో బబుల్ నిబంధనలు కఠినంగా అమలు అవుతున్న సమయంలో ఆస్ట్రేలియాకి అనుష్క శర్మను తీసుకెళ్లి, ఆమెను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని కోహ్లీ భావించాడట.దాంతో ఆసీస్ టూర్‌కి ఒంటరిగానే బయలుదేరనున్నాడు విరాట్ కోహ్లీ. ఇందుకోసం ఇప్పటికే అవసరమైన క్వారంటైన్‌లోకి కూడా వెళ్లిపోయాడు కోహ్లీ....
undefined
నవంబర్ 27న వన్డే సిరీస్‌తో మొదలయ్యే ఆసీస్ టూర్‌లో డిసెంబర్ 17 నుంచి నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్ మొదలవుతుంది...నవరి 7న మూడో టెస్టు మ్యాచ్, జనవరి 15న చివరి టెస్టు మ్యాచ్ జరగనున్నాయి. ఈ సమయంలోనే అనుష్క డెలివరీ ఉండడంతో విరాట్ కోహ్లీ తన బిడ్డను చూసుకునేందుకు స్వదేశం బయలుదేరి రానున్నాడని సమాచారం.
undefined
సెలక్షన్ కమిటీ మీటింగ్‌లో విరాట్ కోహ్లీకి పెటర్నిటీ లీవ్ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఆడిలైన్‌లో జరిగే మొదటి టెస్టు ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగి రానున్నాడు విరాట్.
undefined
విరాట్ కోహ్లీ లీవ్‌తో పాటు ఐపీఎల్‌లో గాయపడిన కొందరు ఆటగాళ్లను వేరే ప్లేయర్లతో భర్తీ చేసింది బీసీసీఐ. గాయపడిన రోహిత్ శర్మను టీ20లు, వన్డే సిరీస్‌లకు దూరంగా ఉంచిన సెలక్టర్లు, టెస్టు సిరీస్‌లో ఆడించబోతున్నారు.
undefined
అలాగే టీ20 జట్టును ఎంపికైన వరుణ్ చక్రవర్తికి గాయం కావడంతో అతని స్థానంలో సన్‌రైజర్స్ యార్కర్ కింగ్ నటరాజన్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ.
undefined
ఐపీఎల్‌లో గాయపడిన వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శర్మ గాయాలను బీసీసీఐ వైద్యులు పర్యవేక్షించనున్నారు. టెస్టు సిరీస్ నాటికి వీరు కోలుకోకపోతే వీరి స్థానంతో ప్రత్యామ్నాయ ప్లేయర్లను ఎంపిక చేస్తారు.
undefined
మొదటి టెస్టు ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ స్వదేశం వస్తుండడంతో టెస్టు సిరీస్‌కి ఎవరు కెప్టెన్సీ చేయబోతున్నారనేది ఇంకా తెలియరాలేదు. టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న అజింకా రహానేకి గానీ రోహిత్ శర్మకు గానీ మిగిలిన మూడు టెస్టుల్లో కెప్టెన్సీ దక్కే అవకాశం ఉంది.
undefined
click me!