ఆస్ట్రేలియాకి చుక్కలు చూపించిన వెస్టిండీస్... స్వల్ప లక్ష్యఛేదనలో ఆసీస్‌ చిత్తు...

First Published Jul 10, 2021, 10:00 AM IST

ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియా, టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతోంది. అందులోనూ టీ20ల్లో దుమ్మురేపే విండీస్ జోరు ముందు నిలవలేకపోతోంది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది...

సెయింట్ లూసియాలోని డారెన్ సమీ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి, వెస్టిండీస్‌కి బ్యాటింగ్ అప్పగించింది ఆస్ట్రేలియా జట్టు.. ఆండ్రూ రస్సెల్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు.
undefined
సిమాన్స్ 27, హెట్మయర్ 20 పరుగులు చేయగా కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ 17 పరుగులు చేసి రనౌట్ కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది విండీస్ జట్టు...
undefined
ఆసీస్ బౌలర్లలో హజల్‌వుడ్‌కి మూడు వికెట్లు దక్కగా, మిచెల్ మార్ష్ 2 వికెట్లు తీశాడు. 146 పరుగుల టార్గెట్ అంటే టీ20ల్లో చాలా స్వల్ప లక్ష్యం కిందే లెక్క. అదీకాక ఆసీస్ జట్టు నిండి ఆల్‌రౌండర్లు, భారీ హిట్టర్లు ఉన్నారు. దీంతో ఆసీస్ ఈజీగా టార్గెట్‌ను చేధిస్తుందని అనుకున్నారంతా...
undefined
ఆరోన్ ఫించ్ 4 పరుగులే అవుటైనా మాథ్యూ వేడ్ 14 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 33 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు... 3.5 ఓవర్లలోనే 46 పరుగులు చేసింది ఆసీస్...
undefined
అయితే మాథ్యూ వేడ్ అవుటైన తర్వాత జోష్ ఫిలిప్ 1, హెడ్రీక్స్ 16 వికెట్లు త్వరత్వరగా కోల్పోయింది ఆసీస్. అయితే మిచెల్ మార్ష్ 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి పోరాడాడు...
undefined
మార్ష్ అవుటైన తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు 16 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో విండీస్ జట్టుకి 18 పరుగుల తేడాతో విజయం దక్కింది...
undefined
విండీస్ బౌలర్ ఓబెడ్ మెక్‌కాయ్ 4 వికెట్లు తీయగా, హెడెన్ వ్లాష్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఫ్యాబియన్ ఆలెన్ రెండు వికెట్లు తీయగా ఆండ్రే రస్సెల్ ఓ వికెట్ తీశాడు...
undefined
ఒకానొకదశలో1125 స్కోరుతో విజయానికి45 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన దశలో ఉన్న ఆసీస్, తేలిగ్గా గెలుస్తుందని అనిపించింది. అయితే వరుస వికెట్లు కోల్పోయి 18 పరుగుల తేడాతో ఘోరపరాజయం పాలైంది.
undefined
click me!