శ్రీలంక- భారత్ మధ్య సిరీస్ వాయిదా... లంక టీమ్‌లో కరోనా కేసులు రావడంతో...

Published : Jul 09, 2021, 09:35 PM ISTUpdated : Jul 09, 2021, 09:48 PM IST

అనుకున్నట్టుగానే శ్రీలంక సిరీస్‌ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం అవుతుందనగా, కరోనా కేసులు వెలుగుచూడడంతో అర్ధాంతరంగా వాయిదా పడింది... షెడ్యూల్ ప్రకారం జూలై 13 నుంచి ప్రారంభం కావాల్సిన సిరీస్‌ను శ్రీలంక బృందంలో వెలుగు చూసిన కరోనా పాజిటివ్ కేసుల కారణంగా మరో నాలుగు రోజులు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఇరుజట్లు...

PREV
17
శ్రీలంక- భారత్ మధ్య సిరీస్ వాయిదా... లంక టీమ్‌లో కరోనా కేసులు రావడంతో...

ఇంగ్లాండ్‌తో వన్డే, టీ20 సిరీస్ ఆడి స్వదేశానికి చేరుకుంది శ్రీలంక జట్టు. అలా వీళ్లు వచ్చారో లేదో, ఇంగ్లాండ్ జట్టులో ఏకంగా ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది...

27

స్వదేశానికి చేరుకున్న తర్వాత శ్రీలంక బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌తో పాటు డాటా అనాలసిస్టట్ జీటీ నిరోషన్‌కి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది.

37

ముందు జాగ్రత్తగా జట్టు మొత్తాన్ని క్వారంటైన్‌కి తరలించి, కరోనా పరీక్షలు నిర్వహించింది శ్రీలంక టీమ్‌. ఇందులో ప్లేయర్లందరికీ నెగిటివ్ వచ్చింది...

47

అయినా ముందు జాగ్రత్తగా వారం రోజుల పాటు క్వారంటైన్‌లో గడపనుంది లంక జట్టు. దాంతో జూలై 13న ప్రారంభం కావాల్సిన సిరీస్‌ను మరో నాలుగు రోజులు వాయిదా వేసి, జూలై 17న ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

57

షెడ్యూల్ ప్రకారం జూలై 13న ప్రారంభం కావాల్సిన మొదటి వన్డే 17న ప్రారంభం కానుంది. రెండో వన్డే 19న, మూడో వన్డే 21న జరుగుతాయి. ఆ తర్వాత జూలై 24న మొదటి టీ20, జూలై 25న రెండో టీ20, జూలై 27న మూడో టీ20 మ్యాచ్ జరుగుతాయి...

67

ఈ సిరీస్ కోసం 20 రోజుల ముందు నుంచే బయో బబుల్‌లో గడుపుతున్న భారత జట్టు, వన్డే సిరీస్ ఆరంభానికి మరో నాలుగు రోజుల పాటు ఎదురుచూడాల్సి వస్తోంది...
 
77

భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌, ఈ సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతుండగా, భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేబడుతున్నారు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు...

click me!

Recommended Stories