రాహుల్ ద్రావిడ్, భారత జట్టుకి కోచ్‌ కాకూడదు... మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కామెంట్స్...

Published : Jul 09, 2021, 04:29 PM IST

శ్రీలంకలో పర్యటించే భారత్ బీ జట్టుకి హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్. త్వరలో భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి‌తో కాంట్రాక్ట్ ముగియనుండడంతో రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా బాధ్యతలు చెపట్టబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ద్రావిడ్, టీమిండియా హెడ్‌కోచ్ కాకూడదని కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్...

PREV
19
రాహుల్ ద్రావిడ్, భారత జట్టుకి కోచ్‌ కాకూడదు... మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కామెంట్స్...

క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉంటూ, తన మీమీలతో క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్... 

29

తాజాగా శ్రీలంక, ఇండియా సిరీస్ ఆరంభానికి ముందు వసీం జాఫర్ ఓ యూట్యూబ్ వీడియో విడుదల చేశాడు. ఇందులో రాహుల్ ద్రావిడ్, టీమిండియా కోచ్‌గా రాకూడదంటూ కామెంట్లు చేశాడు జాఫర్...

39

‘నావరకైతే రాహుల్ ద్రావిడ్, టీమిండియా కోచ్‌గా రాకూడదని అనుకుంటున్నా. ఎందుకంటే అండర్19 ప్లేయర్లకి, ఇండియా ఏ ప్లేయర్లకి, ఎన్‌సీఏలో శిక్షణ తీసుకునే భారత ప్లేయర్లకి ఆయన అవసరం ఎంతో ఉంది...

49

టీనేజ్ క్రికెటర్లకు రాహుల్ ద్రావిడ్ లాంటి లెజెండరీ క్రికెటర్ గైడెన్స్ చాలా అవసరం. ద్రావిడ్ మెంటర్‌షిఫ్‌లోనే ఎందరో అండర్19, ఇండియా ఏ ప్లేయర్లు... అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణించగలమని నిరూపించుకున్నారు...

59

కాబట్టి ఆయన సాధ్యమైనంత ఎక్కువ కాలం ఎన్‌సీఏలోనే ఉండాలి. అప్పుడే భారత జట్టు రిజర్వు బెంచ్ మరింత దృఢంగా, పటిష్టంగా తయారవుతుంది...

69

బీసీసీఐ సృష్టించిన దేశవాళీ క్రికెట్‌ నిర్మాణాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని, వజ్రాల్లాంటి ప్లేయర్లను వెతికి పట్టుకుని, వారికి సానబెట్టి... భారత జట్టుకి అందించగలడు రాహుల్ ద్రావిడ్...

79

ఆయనలా మరెవ్వరూ ఆ పనిని ఇంత పర్ఫెక్ట్‌గా చేయలేరు. ఎన్‌సీఏలో ఇప్పటికే హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్ అవసరం, అండర్ 19 ప్లేయర్లు, ఇండియా ఏ ప్లేయర్లకు చాలా ఉంది...

89

అదే భారతజట్టుకి ఎంపికైన ప్లేయర్లు, అప్పటికే రాటుతేలి ఉంటారు. ఇప్పుడు టీమిండియాలో ఉన్న ప్లేయర్లలో చాలామంది రాహుల్ ద్రావిడ్‌ శిక్షణలో రాటుతేలినవారే. కాబట్టి ఇప్పుడు వారికి ద్రావిడ్ అవసరం ఏముంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు వసీం జాఫర్...

99

ఈ వీడియో చూసిన తర్వాత రాహుల్ ద్రావిడ్, నన్ను కచ్ఛితంగా కొడతాడేమో అంటూ ఈ వీడియో ముందు ఓ ఫన్నీ కామెంట్‌ను జత చేసిన వసీం జాఫర్, ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కి బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహారిస్తున్న విషయం తెలిసిందే.

click me!

Recommended Stories