వాళ్లు కొట్టడం మొదలెడితే, రిజల్ట్ ఇలాగే ఉంటుంది... సఫారీలపై విండీస్ సిక్సర్ల వర్షం...

First Published Jun 27, 2021, 1:07 PM IST

వెస్టిండీస్ క్రికెట్ టీమ్ అంటేనే భారీ హిట్టర్లు. ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ నుంచి ఆండ్రే రస్సెల్, నికోలస్ పూరన్, పోలార్డ్, బ్రావో, ఫాబియన్ ఆలెన్, జాసన్ హోల్డర్... ఇలా ఆ జట్టులో ప్రతీ ప్లేయర్ కూడా హార్డ్ హిట్టింగ్‌కి పెట్టింది పేరు...

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పూర్తిగా విఫలమైన విండీస్ బ్యాట్స్‌మెన్, తమకు బాగా అచొచ్చిన టీ20 ఫార్మాట్‌లో మొదటి మ్యాచ్‌లోనే సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించారు...
undefined
మొదటి టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా... నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది...
undefined
డి కాక్ 37 పరుగులు చేయగా వాన్ డేర్ దుస్సేన్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బ్రావో, ఫ్యాబియన్ ఆలెన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి...
undefined
161 పరుగుల టార్గెట్‌ను 15 ఓవర్లలో ఊదేసింది విండీస్. 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన ఆండ్రూ ఫ్లెట్చర్ రనౌట్ కాగా ఇవిన్ లూయిస్ 35 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు...
undefined
క్రిస్ గేల్ 24 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 32 పరుగులు చేయగా, ఆండ్రూ రస్సెల్ 12 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 23 పరుగులు చేశాడు...
undefined
వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో 15 సిక్సర్లు, 9 ఫోర్లు ఉండడం విశేషం. లక్ష్యచేధనలో బౌండరీల రూపంలోనే 126 పరుగులు చేసింది వెస్టిండీస్.
undefined
టెస్టుల్లో విండీస్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన సౌతాఫ్రికా బౌలర్లు రబాడా, షంసీ, నోకియా, లుంగి ఇంగిడి... టీ20లో వాళ్ల జోరు ముందు నిలవలేకపోయారు...
undefined
click me!