మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది టీమిండియా. అంతకుముందు 1983లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియా... ఆ తర్వాత మరో ఐసీసీ టైటిల్ గెలవలేకపోయింది...
అయితే గత 8 ఏళ్లలో నాలుగేళ్ల పాటు వన్డే, టీ20 ఫార్మాట్లకి కెప్టెన్‌గా వ్యవహారించాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఈ సమయంలో టీమిండియా ఓ వన్డే వరల్డ్‌కప్‌తో పాటు రెండు టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో పాల్గొంది...
2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత జరిగిన 2014 టీ20 వరల్డ్‌కప్, 2015 వన్డే వరల్డ్‌కప్, 2016 టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు మహేంద్ర సింగ్ ధోనీ...
2007 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత మాహీ కెప్టెన్సీలోనే టీమిండియా.. 2009, 2010, 2012 సీజన్లలో కనీసం సెమీ ఫైనల్స్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది.
2014 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక చేతుల్లో ఓడింది టీమిండియా. ఆ మ్యాచ్‌లో 77 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ...
2016 టీ20 వరల్డ్‌కప్ సెమీస్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడింది టీమిండియా. ఈ మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్స్‌తో 89 పరుగులు చేశాడు...
‘2013 తర్వాత భారత జట్టు ఆరు ఐసీసీ ఈవెంట్లలో పాల్గొంది. అందులో మూడు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఆడినవే. ఆ తర్వాతి మూడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడింది.
ధోనీ కెప్టెన్సీలో కూడా టీమిండియా మూడు సార్లు ఐసీసీ టైటిల్ గెలవలేకపోయింది...ఇక్కడ సమస్య కెప్టెన్ ఎవరు? కెప్టెన్సీ ఎలా ఉందనేది కాదు. జట్టు ప్రదర్శన ఎలా ఉందనేదే?
జట్టు మొత్తం కలిసి మంచి పర్ఫామెన్స్ ఇవ్వగలిగినప్పుడే టైటిల్ దక్కుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాక్ చేతుల్లో ఓడిన టీమిండియా, 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది.
2021 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీలో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా... ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతుల్లో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది...