సరైన ప్లేయర్లు లేరు! సరైన మేనేజ్‌మెంట్ లేదు.. ఇంకెలా వరల్డ్ కప్ గెలుస్తారు? టీమిండియాపై యువరాజ్ సింగ్..

Published : Aug 08, 2023, 08:21 PM IST

2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది భారత జట్టు. స్వదేశంలో ఘనమైన రికార్డు ఉన్న టీమిండియా, 2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఇండియాలో వన్డే ప్రపంచ కప్ ఆడనుంది. అయితే ఈసారి టీమిండియాకి వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదంటున్నాడు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్..  

PREV
18
సరైన ప్లేయర్లు లేరు! సరైన మేనేజ్‌మెంట్ లేదు.. ఇంకెలా వరల్డ్ కప్ గెలుస్తారు? టీమిండియాపై యువరాజ్ సింగ్..

2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టిన యువరాజ్ సింగ్, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ గెలిచాడు. 2007 టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువీ.. వన్డే వరల్డ్ కప్ 2023 గెలిచేందుకు కావాల్సిన అర్హతలు, భారత జట్టులో కనిపించడం లేదని అంటున్నాడు..
 

28

‘నేను ఇండియన్‌ని కాబట్టి, భారత జట్టు కచ్ఛితంగా వరల్డ్ కప్ గెలుస్తుందని చెబితే, దేశభక్తుడని అనిపించుకుంటానేమో.. కానీ వరల్డ్ కప్ గెలిచేందుకు కావాల్సిన అర్హతలు, భారత జట్టులో కనిపించడం లేదు. అదీకాక టీమ్‌లో ఎన్నో లోపాలు కనిపిస్తున్నాయి..

38
Image credit: PTI

కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ గాయపడడంతో మిడిల్ ఆర్డర్‌లో సరైన ప్లేయర్లు లేరు. ఈ సమస్య తీరకపోతే కీలక మ్యాచుల్లో మనం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది...
 

48

ముఖ్యమైన మ్యాచుల్లో ప్రయోగాలు చేయవద్దని నేను మరీ మరీ కోరుకుంటున్నా. ఓపెనర్‌గా ఆడడం వేరు, మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడం వేరు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే ప్లేయర్లకు చాలా స్కిల్స్ అవసరం. 

58

సరిగ్గా శ్రద్ధ పెడితే ఈ సమస్య తొలిగిపోతుంది. అయితే మిడిల్ ఆర్డర్ సమస్యను పరిష్కరించడానికి టీమ్ మేనేజ్‌మెంట్ శ్రద్ధ పెట్టినట్టు కూడా నాకు అనిపించడం లేదు. మిడిల్ ఆర్డర్‌లో ఎవరిని ఆడించాలని అనుకుంటున్నారు? మేనేజ్‌మెంట్ దగ్గర దీనికి సమాధానం లేదు..

68

మిడిల్ ఆర్డర్ లోపం స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, వన్డే వరల్డ్ కప్ టోర్నీకి సిద్ధంగా ఉన్నామని ఎలా చెప్పగలం. ఓపెనర్లు త్వరగా అవుట్ అయితే, మిడిల్ ఆర్డర్‌లో భాగస్వామ్యం నిర్మించగల ప్లేయర్లు అవసరం. క్రీజులోకి రాగానే భారీ షాట్లు ఆడే ప్లేయర్లు, ఒత్తిడిని తట్టుకోలేరు...

78

ఒత్తిడిని తట్టుకుని, భాగస్వామ్యం నిర్మిస్తూ ఓపిగ్గా క్రీజులో కుదురుకుపోయి స్కోరుబోర్డును ముందుకు కదిలించడానికి ఎంతో స్పెషల్ టాలెంట్ ఉండాలి. అది చాలా కష్టమైన పని. అనుభవం ఉన్న ప్లేయర్, మిడిల్ ఆర్డర్‌లో అవసరం..

88

సరైన ప్లేయర్లు లేకుండా, టీమ్‌ బాగు కోసం శ్రద్ధ పెట్టే సరైన మేనేజ్‌మెంట్ లేకుండా వరల్డ్ కప్ గెలిచేస్తామని ఎలా చెప్పగలం? రిజల్ట్ ఎలా ఉండబోతుందో నాకు ముందే అర్థమైపోయింది.. అయితే అలా జరగకూడదని కోరుకుంటున్నా..’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. 

click me!

Recommended Stories