ఇప్పటికీ అందరికీ అవే గుర్తున్నాయి! ఈసారి ఫ్యాన్స్ కోసం... వరల్డ్ కప్‌పై విరాట్ కోహ్లీ రియాక్షన్..

Published : Sep 19, 2023, 05:18 PM ISTUpdated : Sep 21, 2023, 11:14 AM IST

2011 వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్న విరాట్ కోహ్లీ, 2023 వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. 2015 వన్డే వరల్డ్ కప్‌కి వైస్ కెప్టెన్‌గా, 2019 వన్డే వరల్డ్ కప్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ, ఈసారి మాజీ కెప్టెన్‌గా, సీనియర్ ప్లేయర్‌గా మాత్రమే ప్రపంచ కప్ ఆడబోతున్నాడు..

PREV
15
ఇప్పటికీ అందరికీ అవే గుర్తున్నాయి! ఈసారి ఫ్యాన్స్ కోసం... వరల్డ్ కప్‌పై విరాట్ కోహ్లీ రియాక్షన్..

గత ఆసియా కప్ టోర్నీ నుంచి బీభత్సమైన ఫామ్‌ని కొనసాగిస్తున్న విరాట్ కోహ్లీ, ఏడాదిలో 7 సెంచరీలు నమోదు చేశాడు. ఆసియా కప్ 2023 టోర్నీలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా గెలిచాడు..

25
Virat Kohli

‘టీమిండియాకి ప్రధాన బలం ఫ్యాన్స్ ఇచ్చే సపోర్టే. వాళ్లకోసమైనా ఈసారి వరల్డ్ కప్ ఎలాగైనా గెలవాలని అనుకుంటున్నాం. 1983 వన్డే వరల్డ్ కప్ చాలామంది చూడలేదు. 2011 వన్డే వరల్డ్ కప్ విజయం ఇప్పటికీ అభిమానుల గుండెల్లో అలా నిలిచిపోయింది..
 

35
Kohli-Rohit hug

2011 వన్డే వరల్డ్ కప్ ఎన్నో మధురానుభూతులను మిగిల్చింది. ఈసారి కూడా అలాంటి గొప్ప అనుభూతులు, ఫ్యాన్స్‌కి అందించడానికి ప్రయత్నిస్తాం. వరల్డ్ కప్‌ కోసం నేను ఎంతగానే థ్రిల్లింగ్‌గా ఎదురుచూస్తున్నా...

45

ఎందుకంటే వన్డే ప్రపంచ కప్ ఆ ఎమోషన్ వేరే లెవెల్‌లో ఉంటుంది. చాలామంది కల, మా కల ఈసారి నిజమవ్వాలని కోరుకుంటున్నా. ఓ క్రికెటర్‌గా, కొన్ని కోట్ల మంది ఆశలను మోయడం కంటే గొప్ప మోటివేషన్ నాకేమీ ఉండదు...

55
Virat Kohli

భారత జట్టు గెలవాలని కొన్ని కోట్ల మంది ఆశపడతారు. గట్టిగా కోరుకుంటారు, ప్రార్థిస్తారు. పూజలు చేస్తారు. వారి పట్టుదలకు, మా సంకల్పం తోడు అయితే అభిమానులు గర్వపడేలా విజయాలు అందుకోగలం..’ అంటూ కామెంట్ చేశాడు భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ.. 
 

click me!

Recommended Stories