బాబర్ ఆజమ్ కెప్టెన్సీపై సంచలన వ్యాఖ్యలు... వరల్డ్ కప్ నుంచి షాదబ్ ఖాన్ అవుట్! ఆ కుర్రాడికి ఛాన్స్..

First Published | Sep 19, 2023, 3:34 PM IST

క్రికెట్‌లో సక్సెస్ కావాలంటే ఆటతో పాటు నోరుని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఐపీఎల్ 2021 సీజన్ సమయంలో ఇలా టీమ్ సెలక్షన్ గురించి నోరు జారడం వల్లే డేవిడ్ వార్నర్..  కెప్టెన్సీ కోల్పోయి, రిజర్వు బెంచ్‌లో కూర్చొని, టీమ్‌ మారాల్సి వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ వైస్ కెప్టెన్ షాదబ్ ఖాన్ ఇదే రకమైన పరిస్థితి ఫేస్ చేయబోతున్నట్టు తెలుస్తోంది..

బాబర్ ఆజమ్ కెప్టెన్సీలో పాకిస్తాన్ క్రికెట్ టీమ్, ఆఫ్ఘాన్, నెదర్లాండ్స్, జింబాబ్వే వంటి చిన్న చితకా జట్లపై సంచలన విజయాలు అందుకుని... నెం.1 వన్డే టీమ్‌గా ఎదిగింది. అయితే ఆసియా కప్ 2023 టోర్నీలో పాక్, ఫైనల్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది..

Shadab Khan

ఆసియా కప్ 2023 టోర్నీలో శ్రీలంక మ్యాచ్ తర్వాత పాక్ డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్ర వాగ్వాదం జరిగినట్టు వార్తలు వచ్చాయి. బాబర్ ఆజమ్, ప్లేయర్లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడని, షాహీన్ ఆఫ్రిదీ అడ్డు చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని ఓ వార్త... సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది..


Shadab Khan

‘ఫీల్డ్‌లో బాబర్ ఆజమ్ చాలా భిన్నంగా ఉంటాడు. ఓ క్లారిటీ లేకుండా వ్యవహరిస్తాడు. ప్రతిదానికీ కోపడ్డతాడు. ఆన్ ఫీల్డ్ అతని కంపెనీ ఎంజయ్ చేయలేం. ఆఫ్ ఫీల్డ్‌లో మాత్రం నవ్వుతూ మాట్లాడుతూ కలిసి పోతాడు.  ఆఫ్ ఫీల్డ్ అతని కంపెనీ బాగా ఎంజాయ్ చేస్తాం...’ అంటూ కామెంట్ చేశాడు షాదబ్ ఖాన్..

ఈ కామెంట్లకి తోడు ఆసియా కప్ 2023 టోర్నీలో షాదబ్ ఖాన్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్, రాహుల్ అందరూ భారీగా పరుగులు చేశారు. 

దీంతో వరల్డ్ కప్‌లో షాదబ్ ఖాన్‌ని తప్పించాలని పీసీబీ ప్రయత్నిస్తోందట. షాదబ్ ఖాన్ ప్లేస్‌లో షాహీన్ ఆఫ్రిదీని వైస్ కెప్టెన్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. 

షాదబ్ ఖాన్ ప్లేస్‌లో అబ్రర్ అహ్మద్‌కి వన్డే వరల్డ్ కప్ 2023 జట్టులో చోటు దక్కవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. అబ్రర్ అహ్మద్, ఇప్పటిదాకా 6 టెస్టులు ఆడి 38 వికెట్లు తీశాడు. ఇప్పటిదాకా వన్డే ఫార్మాట్‌లో ఆరంగ్రేటం చేయని అహ్మద్, వరల్డ్ కప్‌లో మ్యాచ్ విన్నర్ అవుతాడని పీసీబీ భావిస్తోందట..

Fakhar Zaman

షాదబ్ ఖాన్ ప్లేస్‌లో అబ్రర్ అహ్మద్‌కి వన్డే వరల్డ్ కప్ 2023 జట్టులో చోటు దక్కవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. అబ్రర్ అహ్మద్, ఇప్పటిదాకా 6 టెస్టులు ఆడి 38 వికెట్లు తీశాడు. ఇప్పటిదాకా వన్డే ఫార్మాట్‌లో ఆరంగ్రేటం చేయని అహ్మద్, వరల్డ్ కప్‌లో మ్యాచ్ విన్నర్ అవుతాడని పీసీబీ భావిస్తోందట..

Latest Videos

click me!