నాక్కూడా ఇండియాకు వెళ్లాలని లేదు.. ఆ దేశం సపోర్ట్ లేకున్నా మనుగడ సాగిస్తున్నాం : రమీజ్ రాజా

First Published Dec 11, 2022, 5:26 PM IST

Ramiz Raja: అంతర్జాతీయ క్రికెట్ లో పాకిస్తాన్ ఒక బ్రాండ్ గా మారిందని, తమ ఆటగాళ్లకు భారత్ లో కూడా  మంచి ఫాలోయింగ్ ఉందంటున్నాడు రమీజ్ రాజా.  ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న బీసీసీఐ సపోర్ట్ లేకున్నా తమ మనగులుతున్నామని  తెలిపాడు. 

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్ లో  భారత్ పాల్గొనకుంటే తాము కూడా వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు ఇండియా రాబోమని  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా పీసీబీ చీఫ్ రమీజ్ రాజా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము (పీసీబీ)  ఇన్నాళ్లు  ఇండియా మద్దతు లేకున్నా  మనుగడ సాగిస్తున్నామని  స్పష్టం చేశాడు.

ఇంగ్లాండ్ తో  ముల్తాన్  వేదికగా జరుగుతున్న  రెండో టెస్టు కోసం రమీజ్ రాజా స్కై స్పోర్ట్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో  రమీజ్ రాజా మాట్లాడుతూ.. ‘వాస్తవానికి మాకు అక్కడికి (ఇండియాకు) వెళ్లాలని లేదు. కానీ మా ఫ్యాన్స్ అందరూ  ఈ ఇష్యూ (ఆసియా కప్ - 2023) మీద స్పందించాలని కోరడంతో   మేం కూడా రియాక్ట్ అవాల్సి వచ్చింది.

భారత్ -పాకిస్తాన్ క్రికెట్ సంబంధాల గురించి ముఖ్యంగా ఆసియా కప్  పాకిస్తాన్ లో జరిగితే తాము రాబోమని   ప్రకటించిన బీసీసీఐ  ప్రకటన పట్ల  ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. కానీ ఇది అన్యాయం. ఆసియా కప్ అనేది మేం ఒక్కరమే ఆడే టోర్నీ కాదు. వివిధ దేశాలు పాల్గొనే ఈ టోర్నీకి రానని అనడం అన్యాయం.  

వాళ్లు (ఇండియా) రాకపోవడానికి  ప్రభుత్వ విధానం కూడా ఉందని  నేను భావిస్తున్నాను. వాళ్లు వస్తారో రారో కూడా నాకు తెలియదు. ఆసియా కప్ అనేది బహుళ దేశాల టోర్నీ. ఈ విషయంలో మేం కచ్చితంగా ప్రతిఘటిస్తాం. నేను భారత్-పాక్  ద్వైపాక్షిక సిరీస్ లకు సిద్ధంగా ఉన్నాను. ఈ విషయాన్ని నేను ఆన్ ది రికార్డు చెబుతున్నాను. 
 

నేను భారత అభిమానులను  ప్రేమిస్తాను. వాళ్లు మమ్మల్ని ఇష్టపడతారు.  అంతర్జాతీయ క్రికెట్ లో పాకిస్తాన్ ఒక బ్రాండ్ గా మారింది. మా ఆటగాళ్లకు అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇండియాలో ఇండియా మ్యాచ్ ల తర్వాత  అత్యధికంగా వీక్షించేది  పాకిస్తాన్ మ్యాచ్ లే అని నాకు తెలుసు.  

అంతర్జాతీయ క్రికెట్ లో బీసీసీఐ  రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. అలాంటిది ప్రపంచంలో అత్యంత సంపన్న బోర్డు మద్దతు లేకున్నా మేము చాలాకాలంగా మనుగడ సాగిస్తున్నాం.  పాకిస్తాన్ అంతర్గత ఆర్థిక వ్యవస్థ  అత్యున్నత ప్రమాణాలను చూసింది...’ అని రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు.   2013 తర్వాత భారత్ - పాక్ లు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడలేదు. ఇరు దేశాలు కలిసి  ఐసీసీ, ఆసియా కప్ లో ఆడటమే కొనసాగుతోంది. 

click me!