‘జూలో జంతువుల్లా ఉండలేం’... ఆస్ట్రేలియాలో క్వారంటైన్ నియమాలపై టీమిండియా కామెంట్...

First Published Jan 4, 2021, 11:56 AM IST

కరోనా కారణంగా ఆస్ట్రేలియాలో అనేక ఆంక్షలను ఎదుర్కుంటోంది భారత క్రికెట్ జట్టు. మొదటి రెండు టెస్టుల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు కానీ మూడు, నాలుగో టెస్టుల విషయంలో మాత్రం అనేక కఠిన పరీక్షలు ఫేస్ చేయాల్సి వస్తోంది భారత జట్టు. మూడో టెస్టు జరుగుతున్న సిడ్నీలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో రెండో టెస్టు ముగిసిన తర్వాత కూడా ఆరు రోజుల పాటు మెల్‌బోర్న్‌లోనే ప్రాక్టీస్ చేశాయి ఇరు జట్లు.

ఎట్టకేలకు మూడో టెస్టు ఆరంభానికి మూడు రోజుల ముందు జనవరి 4న ప్రత్యేక విమానాల్లో సిడ్నీకి బయలుదేరి వెళ్లనున్నాయి భారత్, ఆస్ట్రేలియా జట్లు...
undefined
అయితే టెస్టు ఆరంభానికి ముందు, టెస్టు సమయంలో హోటల్ గదులకే పరిమితం కావాలని, బయటికి రాకూడదని ఆదేశాలు జారీ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా...
undefined
అయితే ఈ నియమాలపై టీమిండియా ఏ మాత్రం సంతృప్తిగా లేనట్టు తెలుస్తోంది... ‘జూలో జంతువుల్లా ఉండలేమని’ భారత జట్టు సభ్యులు కామెంట్ చేసినట్టు టాక్.
undefined
‘సిడ్నీ గ్రౌండ్‌లో మ్యాచ్ చూసేందుకు దాదాపు 20 వేల మంది ప్రేక్షకులను అనుమతిస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా... వీరు స్వేచ్ఛగా మైదానంలోకి వచ్చి, క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తారు...
undefined
అలాంటి క్రికెటర్లు మాత్రం హోటల్ గదులకే పరిమితమై ఉండి, ప్రేక్షకుల ముందుకొచ్చి మ్యాచ్ ఆడడం అంటే... మేం జూలో జంతువుల్లా కాదు కదా’ అని కొందరు టీమిండియా సభ్యులు తెలియచేసినట్టు సమాచారం.
undefined
హోటల్ గదుల్లోనే క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుందని సూచించిన ఆస్ట్రేలియాకి... అలా ఉండలేమని స్పష్టం చేశారు భారత క్రికెట్ జట్టు సభ్యులు, మేనేజ్‌మెంట్...
undefined
దీంతో హోటల్ చుట్టూ బయో సెక్యూలర్ జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపిన క్రికెట్ ఆస్ట్రేలియా... రెడ్ జోన్స్, హాట్ స్పాట్స్‌ అని ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలియచేసింది.
undefined
ఇప్పటికే ఆస్ట్రేలియా టూర్ కోసం భారత జట్టు అనేక త్యాగాలు చేసిందని, మహ్మద్ సిరాజ్ తన అంత్యక్రియలకు హాజరు కాలేకపోయాడు.
undefined
నటరాజన్ ఇంకా తన బిడ్డను చూసుకోలేదని... ఇంకా ఇలాంటి త్యాగాలు చేసేందుకు టీమిండియా సిద్ధంగా లేదని ఆస్ట్రేలియాకి గట్టిగా చెప్పిందట బీసీసీఐ.
undefined
click me!