21వ శతాబ్దపు బెస్ట్ క్రికెటర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్... రెండో స్థానంలో విరాట్ కోహ్లీ... సచిన్‌కి...

First Published Jan 3, 2021, 4:10 PM IST

ప్రపంచక్రికెట్‌లో భారత సారథి, ‘రన్ మెషిన్’, ‘కింగ్’ విరాట్ కోహ్లీ డామినేషన్ కొనసాగుతూనే ఉంది. ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో రెండు అవార్డులు సొంతం చేసుకున్న విరాట్, తాజాగా ఈ శతాబ్దంపు ఉత్తమ క్రికెటర్‌గా రెండో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్... ఈ శతాబ్దపు ఉత్తమ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన ది డైలీ టెలిగ్రాఫ్ విడుదల చేసిన 21వ శతాబ్దపు టాప్ 50 ప్లేయర్లలో గిల్లీకి టాప్ ప్లేస్‌ దక్కగా భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీకి రెండో స్థానం దక్కింది. టీమిండియా నుంచి విరాట్‌ కోహ్లీతో పాటు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, మహేంద్ర సింగ్ ధోనీ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్‌ టాప్ 50లో చోటు దక్కించుకున్నారు.  రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ వంటివారికి ఈ జాబితాలో చోటు దక్కలేదు...

‘ది డైలీ టెలిగ్రాఫ్’ మ్యాగజైన్ నిర్వహించిన ఓటింగ్‌లో ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌కి అత్యధిక శాతం ఓట్లు వేశాడు ఆస్ట్రేలియా జనాలు...
undefined
వన్డేల్లో ఓపెనర్‌గా, టెస్టుల్లో ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన గిల్‌క్రిస్ట్... వన్డేల్లో 96 స్ట్రైయిక్ రేటుతో టెస్టుల్లో 80 స్ట్రైయిక్ రేటుతో పరుగులు సాధించాడు...
undefined
లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌గా, వికెట్ కీపర్‌గా గిల్‌క్రిస్ట్ సాధించిన రికార్డులు, అతన్ని 21వ శతాబ్దపు బెస్ట్ ప్లేయర్‌గా ఎన్నికయ్యేలా చేశాయి...
undefined
వన్డే, టెస్టుల్లో కలిపి 70 సెంచరీలు చేసిన భారత సారథి ‘కింగ్’ విరాట్ కోహ్లీకి, ఆస్ట్రేలియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఫాలోయింగ్ కారణంగా మిగిలిన ఆసీస్ ప్లేయర్ల కంటే కోహ్లీని టాప్‌లో నిలబెట్టింది.
undefined
ఆడమ్ గిల్‌క్రిస్ట్ కంటే అతికొద్ది ఓట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచిన కోహ్లీ... 87 టెస్టుల్లో 7318 పరుగులు చేయగా, 251 వన్డేల్లో 12 వేలకు పైగా పరుగులు చేశాడు.
undefined
రికీ పాంటింగ్... ఆస్ట్రేలియాకి రెండు వరల్డ్ కప్స్ అందించిన కెప్టెన్, 21వ శతాబ్దపు టాప్ 3 బెస్ట్ ప్లేయర్‌గా ఎన్నికయ్యాడు.. 135 టెస్టుల్లో 11 వేలకు పైగా పరుగులు చేసిన రికీ, 284 వన్డేల్లో 10 వేలకు పైగా పరుగులు చేశాడు.
undefined
జాక్వస్ కలిస్... సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వస్ కలీస్... 21వ శతాబ్దపు బెస్ట్ ప్లేయర్లలో నాలుగో స్థానం దక్కింది...
undefined
ముత్తయ్య మురళీధరన్... శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌కి టెలిగ్రాఫ్ బెస్ట్ ప్లేయర్ల జాబితాలో ఐదో ప్లేస్ దక్కింది.
undefined
స్టీవ్ స్మిత్... ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, టాప్ 50 బెస్ట్ ప్లేయర్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు.
undefined
టాప్ 7: షేన్ వార్న్
undefined
టాప్ 8 : డేల్ స్టెయిన్
undefined
టాప్ 9 : సచిన్ టెండూల్కర్... ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్‌కి 21వ శతాబ్దపు బెస్ట్ క్రికెటర్ల జాబితాలో 9వ స్థానం దక్కింది.
undefined
టాప్ 10: కుమార్ సంగర్కర
undefined
గ్లెన్ మెక్‌గ్రాత్‌కి 11, ఏబీ డివిల్లియర్స్ 12, మాథ్యూ హెడన్ 13, పాక్ ప్లేయర్ యూనిస్ ఖాన్ 14వ స్థానంలో నిలిచాడు.
undefined
బ్రియాన్ లారా 15, జేమ్స్ అండర్సన్ 16, రాహుల్ ద్రావిడ్ 17వ స్థానం దక్కించుకోగా మైఖేల్ క్లార్ 19, కేన్ విలియంసన్ 20వ స్థానంలో నిలిచారు.
undefined
మహేంద్ర సింగ్ ధోనీకి 21వ స్థానం దక్కగా, డేవిడ్ వార్నర్‌కి 25, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కి 28వ స్థానం దక్కింది...
undefined
భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కి 45వ ర్యాంకు దక్కగా, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు.
undefined
click me!