రిషభ్ పంత్ వర్సెస్ దినేశ్ కార్తీక్.. ఎవరాడాలనేది వాళ్లిద్దరే నిర్ణయిస్తారన్న టీమిండియా వికెట్ కీపర్

First Published Aug 15, 2022, 2:37 PM IST

Rishabh Pant vs Dinesh Karthik: టీ20లలో బంతుల వ్యవధిలో ఫలితాన్ని తారుమారు చేయగల సమర్థులు పంత్-కార్తీక్.  వెస్టిండీస్ సిరీస్ లో ఈ ఇద్దరూ కలిసే ఆడారు. ఆసియా కప్ లో కూడా కలిసే ఆడబోతున్నారు. కానీ ఆసీస్ లో జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ లో మాత్రం.. 

Sanju Samson vs Dinesh Karthik

లేటు వయసులో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా అదిరిపోయే ప్రదర్శనలతో అలరిస్తున్నాడు  టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. జట్టులో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ వంటి వికెట్ కీపర్లు ఉన్నా రిషభ్ పంత్ తో  పోటీ పడుతున్నది మాత్రం కార్తీకే. 

Image credit: Getty

ఈ ఇద్దరూ కలిసి మ్యాచులు ఆడుతున్న సందర్భాలూ ఉన్నాయి. రాబోయే టీ20  ప్రపంచకప్ లో ఈ ఇద్దరిలో ఎవరు ఆడతారు..? అనేదానిపై చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తామిద్దరిలో టీ20 ప్రపంచకప్ ఆడేదెవరో తేల్చేశాడు. 

పంత్ మాట్లాడుతూ.. ‘అసలు మేం ఆ విషయం (ఇద్దరి మధ్య పోటీ) గురించి ఆలోచించడం లేదు. పోటీగా కాదు గానీ వ్యక్తిగతంగా మేమిద్దరం మ్యాచ్ లో వంద శాతం బెస్ట్ ఇచ్చేందుకు ఆడతాం. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. 

మిగిలిన విషయాలు నా చేతుల్లో లేవు. ఎవరు ఆడతారు..? ఎవరు జట్టులో ఉండాలనేది కెప్టెన్, హెడ్ కోచ్ నిర్ణయిస్తారు. ఎవరు ఆడటం ద్వారా జట్టుకు ఉపయోగం ఉంటుందనేది వారితో పాటు జట్టు మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది..’ అని అన్నాడు. 

పోటీ పక్కనబెడితే ఈ ఇద్దరూ మ్యాచ్ విన్నర్లే.  టీ20లలో బంతుల వ్యవధిలో ఫలితాన్ని తారుమారు చేయగల సమర్థులే. వెస్టిండీస్ సిరీస్ లో ఈ ఇద్దరూ కలిసే ఆడారు. అంతకుముందు దక్షిణాఫ్రికా తో స్వదేశంలో జరిగిన సిరీస్ లో సైతం  సంయుక్తంగా ఆడారు. 

బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం పంత్ జట్టు అవసరాలను బట్టి మారుతున్నాడు.  ఓపెనర్ నుంచి ఆరో స్థానం వరకు అతడు ప్రతి స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్నాడు. కానీ దినేశ్ కార్తీక్ అలా కాదు. టీమిండియా అతడిని ప్యూర్ హిట్టర్  (ఫినిషర్) గానే భావిస్తున్నది. ఏదైనా మ్యాచ్ లో 15 ఓవర్లలోపు ఐదు వికెట్లు పడ్డా  కార్తీక్ తర్వాత బ్యాటర్ ను పంపిస్తుందే తప్ప అతడిని ముందుకు పంపడం లేదు. 

చివరి ఐదు ఓవర్లలో బ్యాటింగ్ కు వస్తున్న కార్తీక్..  అందుకు అనుగుణంగానే భారీ హిట్టింగ్ లతో మ్యాచ్ లను మలుపు తిప్పుతున్నాడు. చివరి మూడు ఓవర్లలో వచ్చినా భారీ షాట్లతో విరుచుకుపడుతూ భారత్ కు మంచి స్కోర్ అందిస్తున్నాడు. తద్వారా భారత్ ఇటీవల కాలంలో మంచి విజయాలను అందుకుంటున్నది. 

వ్యక్తిగత రికార్డుల పరంగా చూస్తే గడిచిన 10 టీ20లలో పంత్.. 171 పరుగులు చేశాడు. కార్తీక్ 155 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ కార్తీక్ కే ఎక్కువగా ఉన్నా ఇద్దరినీ ఆడించాలనే భావనలో జట్టు యాజమాన్యం ఉంటే అది భారత్ కు కలిసొచ్చేదే. అలా కాకుండా ఎవరో ఒకరినే తీసుకోవాలనుకుంటే సెలక్టర్లకు చిక్కులు తప్పువు. 

click me!