భజ్జూ పా... నువ్వు అక్కడి నుంచి బౌలింగ్ వెయ్యి! 2011 వన్డే వరల్డ్ కప్‌లో హర్భజన్‌కి మాహీ సలహా...

First Published Aug 15, 2022, 1:21 PM IST

హర్బజన్ సింగ్... టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్. అంతర్జాతీయ కెరీర్‌లో 700లకు పైగా వికెట్లు తీసిన హర్భజన్ సింగ్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కంటే ఆరేళ్ల ముందే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు... 2011 వన్డే వరల్డ్ కప్‌లో మాహీ ఇచ్చిన సలహాల గురించి తాజాగా బయటపెట్టాడు హర్భజన్ సింగ్...

గ్రూప్ బీలో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా, సెమీ ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలబడింది. అప్పటికే గ్రూప్ ఏలో వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరిన పాకిస్తాన్, మంచి ఫామ్‌లో ఉంది...

Dhoni-Harbhajan Singh

సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, 4.3 ఎకానమీతో 43 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. అయితే 33 ఓవర్లు ముగిసిన తర్వాత మాహీ ఇచ్చిన సలహా గురించి తాజాగా బయటపెట్టాడు హర్భజన్ సింగ్...

Dhoni-Harbhajan Singh

‘పాకిస్తాన్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నాకు రిథమ్ దొరకడం లేదు. మొదటి ఐదు ఓవర్లలో దాదాపు 26-27 పరుగులు ఇచ్చేశా. వికెట్లు దొరకడం లేదు. ఈ మ్యాచ్‌లో నా పనైపోయిందని అనుకున్నా...

అయితే డ్రింక్స్ బ్రేక్ సమయంలో ధోనీ నా దగ్గరికి వచ్చి... ‘భజ్జూ పా... ఆప్ వహా సే దాలోగే (మీరు అక్కడి నుంచి బౌలింగ్ వేయండి)... ఉమర్ అక్మల్ బాగా ఆడుతున్నాడు. అలాగే మిస్బా చాలా డేంజరస్. వాళ్లు ఈజీగా పరుగులు చేస్తున్నారు. పార్టనర్‌షిప్ ప్రమాదకరంగా మారుతోంది...’ అని చెప్పాడు... 

నేను సరేనని చెప్పి బాల్ తీసుకున్నా. బంతిని చేతుల్లోకి తీసుకోగానే దేవుడిని గుర్తు చేసుకున్నా. ఎలాగైనా ఈ మ్యాచ్‌ని గెలిపించవయ్యా అని వేడుకున్నా. దేవుడు నా ప్రార్థన ఆలకించినట్టున్నాడు. 34వ ఓవర్ మొదటి బంతికే ఉమ్రాన్ అక్మల్ బౌల్డ్ అయ్యాడు...

ధోనీ చెప్పినట్టే అరౌండ్ ద వికెట్ వేశా. అతను బంతిని పూర్తిగా మిస్ అయ్యాడు. క్లీన్ బౌల్డ్... మాహీ అంత తక్కువ సమయంలో ప్లేయర్ల వీక్‌నెస్‌ని ఎలా పసిగడతాడో ఇప్పటికీ అంతుచిక్కదు...’ అంటూ చెప్పుకొచ్చాడు హర్భజన్ సింగ్...

2011 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. సచిన్ టెండూల్కర్ 85 పరుగులు చేయగా వీరేంద్ర సెహ్వాగ్ 38, సురేష్ రైనా 36 పరుగులు చేశారు...

లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 231 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 24 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసిన ఉమర్ అక్మల్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన హర్భజన్ సింగ్, 17 బంతుల్లో ఓ ఫోర్‌తో 19 పరుగులు చేసిన షాహీద్ ఆఫ్రిదీని పెవిలియన్ చేర్చాడు...

click me!