ఆర్‌సీబీలో ఉండి ఉంటే ఎక్కువ కాలం ఐపీఎల్ ఆడేవాడిని! కానీ... - రాస్ టేలర్...

First Published Aug 15, 2022, 2:17 PM IST

అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత న్యూజిలాండ్ జట్టులో రేసిజం గురించి సంచలన ఆరోపణలు చేసిన రాస్ టేలర్, తన ఆటోబయోగ్రఫీ ‘రాస్ టేలర్: బ్లాక్ & వైట్’లో సంచలన విషయాలు బయటపెట్టాడు. ఐపీఎల్ గురించి రాస్ టేలర్ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్‌ దృష్టిలో పడ్డాయి...

2008 ఆరంభ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన రాస్ టేలర్, ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, పూణే వారియర్స్ ఇండియా వంటి జట్ల తరుపున ఆడాడు...

డకౌట్ అయినందుకు రాజస్థాన్ రాయల్స్ యజమాని తనను కొట్టాలని సంచలన ఆరోపణలు చేసిన రాస్ టేలర్, ఈసారి ఐపీఎల్‌లో తన తొలి ఫ్రాంఛైజీ ఆర్‌సీబీపై ఆసక్తికర కామెంట్లు చేశాడు...

Ross Taylor with Virender Sehwag

‘ఆర్‌సీబీ నన్ను 950000 డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ జట్టులో ఎక్కువ కాలం ఉండి ఉంటే చాలా బాగా రాణించేవాడిని. అయితే ఆర్‌సీబీ మూడు సీజన్ల తర్వాత నన్ను అట్టిపెట్టుకోలేదు...

ఐపీఎల్‌లో సెంటిమెంట్స్‌కి తావులేదు. ఎక్కువ కాలం జట్టులో ఉండే ప్లేయర్లకు గౌరవం ఉంటుంది. ఐపీఎల్‌లో ఒకే ఫ్రాంఛైజీకి ఆడి ఉంటే నా గణాంకాలు ఇంకా బాగుండేవి...  ఐపీఎల్‌లోకి వెళ్లినప్పుడు నేను ఒకే ఫ్రాంఛైజీ ప్లేయర్‌గా ఉండాలని అనుకున్నా...

అయితే ఆర్‌సీబీలోనే ఉండి ఉంటే... వీరేంద్ర సెహ్వాగ్, షేన్ వాట్సన్, మహేళ జయవర్థనే, యువరాజ్ సింగ్ వంటి గొప్ప గొప్ప ప్లేయర్లతో కలిసి ఆడే అవకాశం మాత్రం దక్కి ఉండేది కాదు...’ అంటూ రాసుకొచ్చాడు రాస్ టేలర్...

ఐపీఎల్‌లో మొత్తంగా 55 మ్యాచులు ఆడిన రాస్ టేలర్, 25.43 సగటుతో 1017 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

click me!