అసలు సమస్య అక్కడే ఉంది, దాన్ని మారిస్తే చాలు... టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్...

Published : Aug 16, 2022, 05:58 PM IST

టీమిండియా మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత జట్టు, కామన్వెల్త్ గేమ్స్ 2022లో రజతం సొంతం చేసుకుంది. టోర్నీలో టైటిల్ ఫెవరెట్స్‌గా బరిలో దిగిన జట్లకు చుక్కలు చూపించి ఫైనల్ చేరిన భారత జట్టు, ఆఖరి మ్యాచ్‌లో పోరాడి ఓడింది. ఈ విజయం తర్వాత మహిళా క్రికెట్‌పై క్రేజ్ మరికాస్త పెరిగింది...

PREV
17
అసలు సమస్య అక్కడే ఉంది, దాన్ని మారిస్తే చాలు... టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్...

కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్ మ్యాచుల్లో టీమిండియా చేతుల్లో ఉన్న మ్యాచ్, లోయర్ ఆర్డర్ బ్యాటర్ల చెత్త బ్యాటింగ్ కారణంగా చేజారింది. ఆఖరి 2 ఓవర్లలో 17 పరుగులు చేయాల్సిన సమయంలో అనవసర ఒత్తిడికి లోనైన బ్యాటర్లు, లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ల రూపంలో పెవిలియన్ చేరారు...
 

27
Birmingham: Silver medallist Indian women's cricket team players Harmanpreet Kaur and Renuka Singh hold the tricolor after the medal ceremony at the Commonwealth Games 2022, Edgbaston Cricket Ground in Birmingham, UK, Sunday, Aug. 7, 2022. (PTI Photo/R Senthil Kumar)(PTI08_08_2022_000053B)

తాజాగా భారత్‌లో మహిళా క్రికెట్ పర్ఫామెన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్. ‘భారత్ అసలు సమస్య దేశవాళీ క్రికెట్‌కి సరైన సమీకృత వ్యవస్థ లేకపోవడం...
 

37
Harmanpreet kaur

దేశవాళీ టోర్నీలు కరెక్టుగా ఉంటే ప్లేయర్లకు కీలక సమయాల్లో ఒత్తిడిని ఎలా ఫేస్ చేయాలో అనుభవం వస్తుంది. అయితే భారత్‌లో మాత్రం అలాంటి దేశవాళీ క్రికెట్ నిర్మాణం లేదు. ముఖ్యంగా మహిళల కోసం సరైన ఏర్పాట్లు లేవు...

47

ఉన్న అరకోర మ్యాచులు ఆడి సడెన్‌గా భారత జట్టులోకి వచ్చేస్తారు, కీలక మ్యాచుల్లో ఆడాల్సి వచ్చినప్పుడు ఒత్తిడికి గురై సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేరు... వుమెన్స్ ఐపీఎల్ వస్తే ఈ సమస్య సగం వరకూ తీరొచ్చు...

57

వుమెన్స్ ఐపీఎల్ వల్ల యంగ్ ప్లేయర్లకు అంతర్జాతీయ క్రికెటర్లతో ఆడే అవకాశం దొరుకుతుంది. అయితే అంతర్జాతీయ మ్యాచుల్లో ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ఐపీఎల్‌లోనే తెలుస్తుంది. ఆ అనుభవం వారికి అంతర్జాతీయ స్థాయిలో ఉపయోగపడుతుంది...

67

కామన్వెల్త్ గేమ్స్‌లో మేం ఆడిన ఆట మాకెంతో సంతృప్తినిచ్చింది. ఫైనల్‌లో గెలవలేదనే మాటే కానీ మేం మొట్టమొదటిసారి కామన్వెల్త్‌లో అడుగుపెట్టి ఫైనల్ చేరగలిగామంటే... అది కూడా పెద్ద అఛీవ్‌మెంటే...

77

కామన్వెల్త్ గేమ్స్‌‌లో అడుగుపెట్టినప్పుడే పతకం సాధించాలని అనుకున్నాం. అనుకున్నట్టే మెడల్ గెలవగలిగాం. ఆ విషయంలో మేం విజయం అందుకున్నాం...’ అంటూ చెప్పుకొచ్చింది భారత మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్... 

click me!

Recommended Stories