12 ఏళ్ల తర్వాత స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఆడబోతోంది టీమిండియా. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది భారత జట్టు. 2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత రెండు సార్లు వరల్డ్ కప్ టోర్నీల్లో సెమీస్ చేరి, ఇంటిదారి పట్టింది భారత జట్టు...
2019 వన్డే వరల్డ్ కప్ గ్రూప్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా నిలిచింది టీమిండియా. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా వరుస విజయాలతో సెమీస్ చేరింది. అయితే సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది..
210
Sourav Ganguly
2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత 10 ఏళ్లుగా ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేకపోయిన టీమిండియాకి స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్ ఓ అద్భుత అవకాశం. అయితే వరల్డ్ కప్‌పై కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ..
310
‘ప్రతీసారి వరల్డ్ కప్ గెలవాలంటే అయ్యేపని కాదు. కొన్నిసార్లు బ్యాడ్ టైమ్ ఉంటుంది. కొన్నిసార్లు గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది.. ఈసారి వరల్డ్ కప్ గెలిపించే బాధ్యత బ్యాటర్లపైనే ఉంది..
410
ఎందుకంటే బ్యాటర్లు బాగా ఆడితేనే టీమిండియా మంచి స్కోరు చేయగలుగుతుంది. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడం బౌలర్ల చేతుల్లో ఉంది. పూర్తిగా బౌలర్లపైనే భారం వేయడం కూడా కరెక్ట్ కాదు...
510
Kohli-Rohit
వరల్డ్ కప్ వేరు, ఆసియా కప్ వేరు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ వేరు. ప్రతీ సిరీస్ కూడా ఆ సమయంలో మనం ఎలా ఆడుతున్నామనేదానిపైనే ఆధారపడి ఉంటుంది..
610
Image credit: Getty
టీమిండియా చాలా స్ట్రాంగ్ టీమ్. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే వరల్డ్ కప్ గెలవాలంటే మాత్రం పేపర్ మీద ఎంత స్ట్రాంగ్‌గా ఉందో, గ్రౌండ్‌లోనూ అంత స్ట్రాంగ్ పర్ఫామెన్స్ చూపించగలగాలి..
710
Sanju and Chahal
యజ్వేంద్ర చాహాల్ కంటే మెరుగ్గా బ్యాటింగ్ చేస్తాడనే ఉద్దేశంతోనే అక్షర్ పటేల్‌ని ఎంపిక చేశారు. నాకైతే ఇది మంచి నిర్ణయంగానే అనిపిస్తోంది. అయినా ఏ ప్లేయర్ అయినా గాయపడితే ఆ ప్లేస్‌లో యజ్వేంద్ర చాహాల్‌ని ఆడిస్తే సరిపోతుంది..
810
ఆసియా కప్‌కి ఎంపిక చేసింది 17 మందితో కూడిన టీమ్. అందులో ఇద్దరిని కచ్ఛితంగా తప్పించాల్సిందే. ఫామ్‌ని దృష్టిలో పెట్టుకుని బెస్ట్ ఫాస్ట్ బౌలింగ్ టీమ్‌ని, బెస్ట్ పేస్ అటాకర్లను తీసుకున్నారు. బాగా ఆడితే ఆసియా కప్ 2023 గెలవడం ఈ టీమ్‌కి పెద్ద కష్టమైన పనేమీ కాదు..
910
పాకిస్తాన్ చాలా పటిష్టంగా ఉంది. ముఖ్యంగా వాళ్ల బౌలింగ్ అటాక్ సూపర్ స్ట్రాంగ్. నసీం షా, షాహీన్ ఆఫ్రిదీ, హారీస్ రౌఫ్... వీళ్లను ఫేస్ చేయడం అంత తేలికైన విషయం కాదు.
1010
అయితే టీమిండియాని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆ రోజు ఎవరు బాగా ఆడితే వాళ్లే గెలుస్తారు.. ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ..