వరల్డ్ కప్ గెలిచే సీన్ మనకి లేదు... భారత డ్రెస్సింగ్ రూమ్‌లో మాజీ కోచ్ కామెంట్స్ విని...

Published : Jul 29, 2022, 12:15 PM IST

2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమిని భారత క్రికెట్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. ఆ బాధ నుంచి బయటపడకముందే 2007 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ చేతుల్లో ఘోర పరాభవాన్ని చవిచూసింది టీమిండియా. ఈ రెండు అపజయాల తర్వాత 2011 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా, 100 కోట్ల మంది భారతీయుల కలను నిజం చేసింది...

PREV
110
వరల్డ్ కప్ గెలిచే సీన్ మనకి లేదు... భారత డ్రెస్సింగ్ రూమ్‌లో మాజీ కోచ్ కామెంట్స్ విని...
Image Credit: Getty Images

2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పెద్దగా అంచనాలు లేకుండా బరిలో దిగిన మహేంద్ర సింగ్ ధోనీ టీమ్, వరుస విజయాలతో ఫైనల్‌కి దూసుకొచ్చింది. అయితే ఫైనల్ మ్యాచ్‌కి ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి పరిస్థితి ఉంది...

210

ఈ షాకింగ్ విషయాన్ని తాజాగా బయటపెట్టాడు టీమిండియా మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ అప్టన్. 2008 నుంచి 2011 వరకూ భారత జట్టుకి మెంటల్ కోచ్‌గా వ్యవహరించాడు ప్యాడీ అప్టన్...

310
Image credit: Getty

‘ఆసియా కప్ ఫైనల్ జరుగుతోంది. అప్పటికి 2011 వన్డే వరల్డ్ కప్ ఇంకా 10 నెలల సమయం ఉంది. ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో శ్రీలంకలోనే మ్యాచ్ ఆడుతున్నాం. అప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ ఓ ప్రశ్న అడిగాడు...

410

‘‘ఒకవేళ ఇదే వరల్డ్ కప్ ఫైనల్ అనుకుందాం. ఇలాగే వెళ్లి గెలవగలమా?’’ అని... దానికి మళ్లీ అతనే సమాధానం చెప్పాడు... ‘లేదు.. వరల్డ్ కప్ ఫైనల్ గెలిచేందుకు మనం రెఢీగా లేం...’ అని...

510

ఎందుకంటే అప్పుడు జట్టులో స్వదేశంలో సొంత అభిమానుల మధ్య ఆడుతున్నామనే ప్రెషర్ చాలా ఉండింది. వాంఖడేలో జరిగిన ఫైనల్‌లో అది క్లియర్‌గా కనిపించింది...

610

మ్యాచ్ చూడడానికి వచ్చిన క్రికెట్ ఫ్యాన్స్, సైలెంట్‌గా మ్యాచ్‌ని ఎంజాయ్ చేయరు. ఏ మాత్రం తేడా జరిగినా అరిచి గగ్గోలు పెడుతూ ప్లేయర్లను తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టేస్తారు.. అదీకాకుండా సచిన్ టెండూల్కర్‌కి అది ఆఖరి వరల్డ్ కప్ మ్యాచ్...

710

ఆ ఫైనల్ మ్యాచ్‌లో ఆడిన ప్రతీ ప్లేయర్ తీవ్రమైన ఒత్తిడిని అనుభవించారు. అలాంటి హై ప్రెషర్ మ్యాచుల కోసం ప్లేయర్లు ముందుగానే మానసికంగా సిద్ధం కావాలి..

810

ఆ రోజు నుంచి ప్రతీ మీటింగ్‌లోనూ ఇదే మాటతో డిస్కర్షన్ మొదలెట్టాం... ‘ముంబైలో జరిగే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్’ అంటూ మీటింగ్ మొదలయ్యేది. దీంతో ఫైనల్ మ్యాచ్‌కి వచ్చేసరికి ప్లేయర్లు ఆ పరిస్థితులకు అలవాటు పడ్డారు...

910

ఆటగాళ్లను ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు 10 నెలల నుంచే మెంటల్‌గా ప్రిపేర్ చేయడం మొదలెట్టాం. ఫైనల్‌కి వచ్చినప్పుడే మేమే గెలవబోతున్నామనే నమ్మకం ప్లేయర్లలో నిండిపోయింది... ’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ అప్టన్... 

1010
Sachin Tendulkar

2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది టీమిండియా. గౌతమ్ గంభీర్ 97 పరుగులతో, మహేంద్ర సింగ్ ధోనీ 91 పరుగులు చేసి ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకి విజయాన్ని అందించారు..

click me!

Recommended Stories