కెఎల్ రాహుల్ గాయం, సంజూ శాంసన్‌కి బాగానే కలిసి వస్తోంది. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో మెప్పించిన సంజూ శాంసన్, వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ అటు బ్యాటుతోనూ, ఇటు వికెట్ కీపింగ్‌తోనూ ఇంప్రెసివ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు... దీంతో సంజూ శాంసన్‌కి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
కెఎల్ రాహుల్ కరోనా పాజిటివ్‌గా తేలి, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో సంజూ శాంసన్‌ని టీ20 సిరీస్ టీమ్‌కి జత చేస్తూ నిర్ణయం తీసకుంది బీసీసీఐ...
28
Sanju Samson
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో సంజూ శాంసన్‌కి చోటు దక్కకపోవడం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఐర్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన సంజూ శాంసన్, ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో తుది జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు...
38
Image credit: PTI
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 18 బంతుల్లో ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసి అవుటైన సంజూ శాంసన్, రెండో వన్డేలో 51 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి వన్డే కెరీర్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్నాడు...
48
Sanju Samson
వర్షం అంతరాయం కలిగించిన మూడో వన్డేలో 7 బంతుల్లో 6 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన సంజూ శాంసన్, మూడు మ్యాచుల్లోనూ వికెట్ల వెనకాల వికెట్ కీపింగ్‌తో మెప్పించాడు...
58
తొలి వన్డేలో ఆఖరి ఓవర్‌లో సిరాజ్ వేసిన యార్కర్ బౌండరీకి వెళ్లకుండా డైవ్ చేస్తూ ఆపిన సంజూ శాంసన్, మూడో వన్డేలో బీభత్సమైన ఫామ్‌లో ఉన్న విండీస్ ఓపెనర్ షై హోప్‌ని స్టంపౌట్ చేసి పెవిలియన్ చేర్చాడు...
68
Sanju Samson
కెఎల్ రాహుల్ జట్టుకి దూరం కావడంతో అతని స్థానంలో మరో ఓపెనర్ జట్టుకి అవసరమయ్యాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో ఇషాన్ కిషన్ రూపంలో ఓ ఓపెనర్ ఉన్నా, స్టాండ్ బై ఓపెనర్‌గా మరో ప్లేయర్ అవసరం ఉంది...
78
Sanju Samson
ఇప్పటికే ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ని ఓపెనర్‌గా ఉపయోగించి సక్సెస్ అయ్యింది భారత జట్టు. అలాగే దీపక్ హుడా కూడా ఓపెనర్‌గా సక్సెస్ అయ్యాడు..
88
Sanju Samson
ఇప్పుడు సంజూ శాంసన్‌కి కూడా టీ20 సిరీస్‌లో చోటు ఇవ్వడంతో రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసేందుకు ఒకరికి ముగ్గురు ప్లేయర్లు అందుబాటులోకి వచ్చారు. సంజూ శాంసన్ ఓపెనర్‌గానే కాకుండా మిడిల్ ఆర్డర్‌లోనూ రాణించగలగడం అతనికి అడ్వాంటేజ్‌గా మారింది..