వాడేం మెస్సీ కాదు! రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టారని తెగ ఫీలైపోవడానికి... పీసీబీ ఛైర్మెన్ షాకింగ్ కామెంట్..

Published : Oct 10, 2022, 05:00 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైపోయింది. మరో 10 రోజుల్లో అసలు సిసలు సమరానికి తెర లేవనుంది. అయితే పొట్టి ప్రపంచకప్‌కి పీసీబీ ప్రకటించిన జట్టులో సీనియర్ మోస్ట్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కి చోటు దక్కలేదు. అసలే మిడిల్ ఆర్డర్‌ వీక్‌గా ఉండడంతో మాలిక్‌కి చోటు దక్కకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి...

PREV
16
వాడేం మెస్సీ కాదు! రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టారని తెగ ఫీలైపోవడానికి... పీసీబీ ఛైర్మెన్ షాకింగ్ కామెంట్..
Babar and Rizwan

పాకిస్తాన్ బ్యాటింగ్ మొత్తం ఓపెనర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌లపై ఆధారపడుతోంది. ఈ ఇద్దరూ త్వరగా అవుటైతే మిడిల్ ఆర్డర్‌లో పెద్దగా పరుగులు రావడం లేదు. ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ ఈ వీక్‌నెస్ స్పష్టంగా కనిపించింది...

26

‘టీ20 ఫార్మాట్‌ని చాలా ఏళ్లుగా ఆడుతున్నాం. నాకైతే పాక్ క్రికెట్ టీమ్‌ బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి సమస్య కనిపించడం లేదు. ఫార్మాట్ ఏదైనా నిలకడైన ప్రదర్శన ఇవ్వాలంటే అది మంచి జట్టును ఎంపిక చేసే సెలక్టర్లపైనే ఆధారపడి ఉంటుంది...

36
Babar Azam

కెప్టెన్ కూడా బలంగా ఉండాలి. అయినా అంతగా ఫీల్ అవ్వడానికి బెంచ్‌లో లియెనెల్ మెస్సీనేం కూర్చోబెట్టడం లేదు. జట్టులో ఉన్న ప్లేయర్లు టాలెంట్ లేకుండా టీమ్‌లోకి వచ్చిన వాళ్లేం కాదు... 

46

పాకిస్తాన్‌ ముందు చాలా తక్కువ ఆప్షన్లు ఉన్నాయి. అందుకే ఆప్షన్లు పెంచుకోవడానికి యువకులకు అవకాశాలు ఇవ్వడం చాలా ముఖ్యం. జూనియర్ లెవెల్‌లో టాలెంట్ ఉన్న ప్లేయర్లను గుర్తించడానికి చాలా కృషి చేస్తున్నాం. అలా గుర్తించిన వారికి అవకాశాలు ఇవ్వకపోతే ఫలితం ఏముంటుంది...

56
babar

అదే నా ఫిలాసఫీ... కెప్టెన్ మాత్రం బలంగా ఉంటే సరిపోదు, జట్టుకి ఎంపికయ్యే ప్రతీ ప్లేయర్ కూడా బలంగా మారాలి. అప్పుడే ఎలాంటి టోర్నీ అయినా గెలవచ్చు. ఇప్పుడు మేం చేస్తుంది అదే... ఎవరిని ఆడించాలో మాకు బాగా తెలుసు...

66

నేను చేసినది, ఎవ్వరూ చేయలేదు. రాజకీయ ఒత్తిడులను నేను లెక్కచేయను. టీమ్ ఓడిపోతే అది నా ఓటమి కిందే లెక్క. టీ20 వరల్డ్ కప్‌కి పాకిస్తాన్ బెస్ట్ ఫామ్‌లో వెళ్తోంది. వరల్డ్ కప్ గెలిచే సత్తా పుష్కలంగా ఉంది... ’ అంటూ చెప్పుకొచ్చాడు పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా...

click me!

Recommended Stories