ఇషాన్ బాదుడుకు ఫిదా అయిన గర్ల్ ఫ్రెండ్.. ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ వైరల్

Published : Oct 10, 2022, 02:55 PM IST

Ishan Kishan: టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్  నిన్న దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండో టీ20లో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి  భారత్ కు విజయాన్ని అందించడమే గాక సిరీస్ సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.   

PREV
17
ఇషాన్ బాదుడుకు ఫిదా అయిన గర్ల్ ఫ్రెండ్.. ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ వైరల్

ఐపీఎల్‌-15 వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు ఇషాన్ కిషన్.. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో దుమ్ము దులిపాడు.  ఈ మ్యాచ్ లో ఇషాన్.. 84 బంతుల్లోనే 93 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. శ్రేయాస్ అయ్యర్ తో కలిసి మూడో వికెట్ కు 161 పరుగులు జోడించాడు. 

27

తృటిలో సెంచరీ కోల్పోయిన ఇషాన్ ఆటకు అతడి గర్ల్ ఫ్రెండ్ (?) అదితి హుందియా ఫిదా అయింది.  భాగా ఆడావ్ అంటూ ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్   స్టోరీస్ లో అయ్యర్-ఇషాన్ లు కలిసి ఆడుతున్న ఫోటోను షేర్ చేస్తూ తన ప్రేమను తెలియజేసింది. 

37

ఫోటో షేర్ చేస్తూ అదితి.. ‘వెల్ డన్  ఐకే (ఇషాన్ కిషన్)’ అని రాసుకొచ్చింది. ఈ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. ఇద్దరి మధ్య గత కొన్నాళ్లుగా  ప్రేమాయణం సాగుతున్నది. ఇద్దరు ప్రేమగా హగ్ చేసుకున్న ఫోటోలు కూడా గతంలో వైరల్ కావడంతో ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని  గుసగుసలు వినిపిస్తున్నాయి. 

47

రాజస్తాన్ కు చెందిన అదితి.. 2017 మిస్ ఇండియా పోటీలలో పాల్గొంది.  ఆ ఏడాది ఫైనల్ వరకు వెళ్లిన  ఆమె.. ఎఫ్బీబీ కలర్స్ ఫెమినా మిస్ ఇండియా రాజస్తాన్ కిరీటం గెలుచుకుంది.  అంతకుముందే ఆమె 2016లో మిస్ బాడీ బ్యూటిఫుల్,  2016లో మిస్ రాజస్తాన్ గా నిలిచింది.  

57

గత ఐపీఎల్ వేలంలో ఇషాన్ ను ముంబై ఇండియన్స్ రూ. 15.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసినప్పుడు కూడా అదితి.. ముంబై ఇన్స్టాలో పెట్టిన ఓ పోస్టుకు రియాక్ట్ అయింది. ‘ఒకింత గర్వం, సంతోషంగా ఉంది’ అని పోస్టులో రాసుకొచ్చింది.  

67

వాస్తవానికి అదితి ఫేవరేట్ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీలు. కానీ ఫీల్డ్ లో ఇషాన్ కిషన్ ఉంటే మాత్రం ఆమె  తన చూపును అతడి మీదినుంచి మళ్లనీయదు. 

77

ఇక నిన్నటి మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయిన ఇషాన్ మ్యాచ్ అనంతరం స్పందిస్తూ.. ‘కొంతమంది ఆటగాళ్లు వికెట్ల మధ్య స్ట్రైక్ రొటేట్ చేస్తారు. కానీ నేను అలా కాదు. నా బలం సిక్సర్లు బాదడం. చాలా మంది  ఇబ్బందిపడే పని నాకు చాలా సులువు.  నేను సిక్సర్లు కొట్టడంలో సఫలమవుతున్నప్పుడు మళ్లీ సింగిల్స్ తీయడం దేనికి..?’ అంటూ ఘాటు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. 

click me!

Recommended Stories