అనిల్ కుంబ్లే నుంచి శిఖర్ ధావన్ దాకా... విడాకులు తీసుకున్న మహిళలను పెళ్లాడిన క్రికెటర్లు వీరే...

First Published | Apr 27, 2021, 6:30 PM IST

జీవితంలో పెళ్లికి ఉండేంత ప్రాధాన్యం మరోదానికి ఉండదేమో. సరికొత్త జీవితానికి నాందిగా పిలువబడే పెళ్లి, ఇద్దరు వ్యక్తులను ఒక్కటిగా చేస్తుంది. విపత్కర పరిస్థితుల్లో కూడా ఐపీఎల్ ద్వారా జనాలకు వినోదాన్ని అందించాలని తాపత్రయపడుతున్నారు మన క్రికెటర్లు. 

భారత క్రికెటర్లలో కొందరు పెళ్లై, విడాకులు తీసుకున్న మహిళలను ప్రేమించి, పెళ్లాడారంటే నమ్ముతారా? అవును... అందరికీ శిఖర్ ధావన్ గురించి మాత్రమే తెలుసు కానీ భారత జట్టుకి ఆడిన ప్లేయర్లలోనే ఈ లిస్టు కాస్త పెద్దదే...
అనిల్ కుంబ్లే: టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు అనిల్ కుంబ్లే. కుంబ్లే 1999లో చేతనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే చేతనకు అంతకుముందే పెళ్లి అయ్యి, ఓ కూతురు కూడా ఉంది.

అయితే భర్తతో విడాకులు తీసుకున్న చేతనను ఇష్టపడిన అనిల్ కుంబ్లే, ఆమె కూతురిని కూడా సొంత కూతురిగానే చూసుకుంటున్నాడు. ఇప్పుడు వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఓ కొడుకు ఉన్నారు...కూతుర్లు అరుణీ, స్వస్తి కుంబ్లే కాగా కొడుకు పేరు మయాస్ కుంబ్లే.
వెంకటేశ్ ప్రసాద్: భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్, 1997లో జయంతిని వివాహం చేసుకున్నాడు. అయితే జయంతికి అప్పటికే వివాహం జరిగి, విడాకులు కూడా జరిగాయి.
ఒంటరిగా ఉన్న జయంతిని, వెంకటేశ్ ప్రసాద్‌కు పరిచయం చేసింది కూడా అనిల్ కుంబ్లేనే. 24 ఏళ్లుగా వీరి కాపురం సజావుగా సాగిపోతోంది...
మహ్మద్ షమీ: మహ్మద్ షమీ, హాసీన్ జాహన్‌ను 2014లో పెళ్లి చేసుకున్నాడు. అయితే మిగిలిన క్రికెటర్ల పోలిస్తే షమీ స్టోరీ పూర్తిగా విరుద్దం. హాసీన్ జాహన్‌కి అప్పటికే పెళ్లైన విషయం షమీకి తెలియదట.
హాసీన్ జాహన్ మొదట భర్త ఓ కూరగాయాల వ్యాపారం చేసేవాడు. మొదటి భర్త కారణంగా హాసీన్‌కి ఓ కూతురు కూడా ఉంది. విడాకులు అయిన విషయం దాచి, తనను పెళ్లి చేసుకుందని హాసీన్‌పై ఆరోపణలు చేశాడు షమీ. ప్రస్తుతం ఈ ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్న విషయం తెలిసిందే.
మురళీ విజయ్: మిగిలిన క్రికెటర్లలాగే కాకుండా స్నేహితుడిని మోసం చేసి... రెండో పెళ్లి చేసుకున్నాడు మురళీ విజయ్. మురళీ విజయ్, దినేశ్ కార్తీక్ మంచి స్నేహితులుగా ఉండేవారు.
ఇలా దినేశ్ కార్తీక్ ఇంటికి వచ్చి వెళుతూ ఉండే మురళీ విజయ్, అతని మొదటి భార్య నికితాతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ విషయం మురళీ విజయ్‌కి తెలియడంతో నికితాకి విడాకులు ఇచ్చాడు.
దినేశ్ కార్తీక్‌తో విడాకులు తీసుకున్న నికితాను పెళ్లాడిన మురళీ విజయ్‌‌కి ప్రస్తుతం ఓ కూతురు, ఓ బాబు ఉన్నారు. నికితాకి విడాకులు ఇచ్చిన తర్వాత దినేశ్ కార్తీక్, దీపికా పల్లికల్‌ను వివాహం చేసుకున్నాడు.
శిఖర్ ధావన్: మిగిలిన వారితో పోలిస్తే స్ఫూర్తిదాయకమైన ప్రేమకథ ‘గబ్బర్’దే. తనకంటే పదేళ్లు పెద్దదైన అయేషా ముఖర్జీని ప్రేమించి పెళ్లాడాడు శిఖర్ ధావన్...
హర్భజన్ సింగ్‌కి ఫేస్‌బుక్ ఫ్రెండ్ అయిన అయేషా ముఖర్జీని చూడగానే ఇష్టపడిన శిఖర్ ధావన్, ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అలా ఫేస్‌బుక్‌లో ఏర్పడిన పరిచయంతో ఆమె గురించి పూర్తిగా తెలుసుకుని... అప్పటికే పెళ్లై ఇద్దరు కూతుర్లు ఉన్న అయేషాను పెళ్లాడాడు శిఖర్ ధావన్.

Latest Videos

click me!