దాని గురించి మాట్లాడి వేస్ట్ : స్టార్క్-బట్లర్ వివాదంపై ఆసీస్ టెస్టు కెప్టెన్ స్పందన

Published : Oct 17, 2022, 03:36 PM IST

Starc-Buttler Row: గత నెలలో క్రికెట్ ప్రపంచంలో ఆసక్తికర చర్చకు తెరలేపిన దీప్తిశర్మ రనౌట్ వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిన ఘనత ఆస్ట్రేలియాది. తాజాగా ఈ ఘటనపై ఆసీస్ టెస్టు కెప్టెన్ స్పందించాడు. 

PREV
17
దాని గురించి మాట్లాడి వేస్ట్ :  స్టార్క్-బట్లర్ వివాదంపై ఆసీస్ టెస్టు కెప్టెన్ స్పందన

ఇంగ్లాండ్ తో గత నెలలో ముగిసిన వన్డే సిరీస్ లో భారత స్పిన్నర్ దీప్తి శర్మ, ఇంగ్లీష్ బ్యాటర్ ను నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ‘మన్కడ్’ ద్వారా రనౌట్ చేయడం వివాదానికి తెరలేపింది.  మరీ ముఖ్యంగా ఇంగ్లీష్ క్రికెటర్లు, మీడియా దీనిని భూతద్ధంలో పెట్టి చూపించాయి.  

27

అయితే  పదిహేను రోజుల తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. కానీ తాజాగా ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్.. ఇంగ్లాండ్ తో మూడో  టీ20లో నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న జోస్ బట్లర్ ను క్రీజులోనే ఉండాలని హెచ్చరించాడు. రనౌట్ ప్రయత్నమేమీ చేయకున్నా.. ‘క్రీజులోనే ఉండు. నేను దీప్తిని కాదు..’ అంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. 

37

స్టార్క్ వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. పలువురు భారత మాజీ క్రికెటర్లు.. మీరు మీరు కొట్టుకుచావండి.. అది (నాన్ స్ట్రైకర్స్ రనౌట్) నిబంధనల్లోనే ఉంది. మరి మా అమ్మాయి మీద పడి ఏడ్వడం దేనికి..?  అని స్టార్క్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. 

47

తాజాగా దీనిపై ఆసీస్ టెస్టు జట్టు సారథి  ప్యాట్ కమిన్స్  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తానైతే అలా చేయనని.. అసలు తాను రనప్ లో ఉన్నప్పడు బ్యాటర్ల గురించి పట్టించుకోనని స్పష్టం చేశాడు. 

57

కమిన్స్ మాట్లాడుతూ.. ‘నేను బంతి చేతిలో పట్టుకుని రనప్ మొదలుపెట్టాక నాన్ స్ట్రైకింగ్ బ్యాటర్లను చూడను.  దాని గురించి ఆగి, బ్యాటర్లను హెచ్చరించడం, రన్ అవుట్ చేయడం అనేది  మన శక్తిని వృథా చేసుకోవడం వంటిది. జోష్ హెజిల్వుడ్ చెప్పినట్టు నేను కూడా దానికి చాలా దూరం. 

67

ఇక దీని గురించి విస్తృత స్థాయిలో చర్చ జరుగుతున్న తరుణంలో మాట్లాడటం కూడా  మంచిది కాదు. దీనికి కేవలం రనౌట్ గానే చూడాలని నేను భావిస్తున్నా.  మరి ఇలా ప్రతి బౌలర్ చేస్తారని నాకైతే కచ్చితంగా తెలియదు. కానీ బ్యాటర్ మాత్రం జాగ్రత్తగా ఉండాలని’  అన్నాడు. 

77

ప్రపంచకప్ ప్రారంభానికి ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో  భాగంగా   ఈ విధానాన్ని ఉపయోగిస్తారా.? అన్న ప్రశ్నకు  16 మంది జట్ల  సారథులు మౌనం దాల్చడం గమనార్హం. 

click me!

Recommended Stories