నా వల్లే పాక్ బ్యాటర్లు ఆ షాట్స్ ఆడడానికి భయపడుతున్నారు... పాక్ మాజీ కెప్టెన్ మిస్బా వుల్ హక్...

First Published | Oct 17, 2022, 3:20 PM IST

ఏబీ డివిల్లియర్స్ 360 డిగ్రీస్ బ్యాటర్. గ్రౌండ్‌ని అన్ని వైపులా కొత్త కొత్త షాట్స్ ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించడం ఏబీడీ స్పెషాలిటీ. సూర్యకుమార్ యాదవ్ కూడా ఏబీడీతో సమానంగా షాట్స్ ఆడతాడు. అందుకే సూర్యని ఇండియన్ ఏబీడీ అని కూడా పిలుస్తారు. అయితే పాక్ జట్టులో బ్యాటర్లు మాత్రం ఇలాంటి షాట్స్ ఆడరు. వాళ్లకి తెలిసిదల్లా క్రీజులో తీరిగ్గా నిలబడి బంతిని బలంగా కొట్టడమే...

Babar Azam

క్రికెట్ ప్రపంచమంతా కొత్త కొత్త ప్రయోగాలు అలవర్చుకుని, వినూత్నమైన షాట్స్‌తో దూసుకుపోతుంటే ఇప్పటికే పాక్ క్రికెటర్లు మూస పద్ధతినే అనుసరిస్తున్నారు. ఇది మిగిలిన క్రికెట్ ఫ్యాన్స్‌ చేసిన ఆరోపణలు కావు, పాకిస్తాన్ మాజీ కెప్టెన్లు చేస్తున్న వాదనే. ‘మీరు సూర్యకుమార్ యాదవ్‌లా 360 డిగ్రీస్‌లో షాట్స్ ఎలాగూ ఆడలేరు. కనీసం అందులో సగం 180 డిగ్రీలైనా ఆడడానికి ప్రయత్నించండి...’ అంటూ పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ చేసిన కామెంట్లు అక్కడ సంచలనం క్రియేట్ చేశాయి...

తాజాగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆరంభానికి ముందు ఓ టీవీ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న వసీం అక్రమ్, ఇదే వ్యాఖ్యలు మరోసారి చేశాడు. దీనికి పాక్ మాజీ కెప్టెన్ మిస్బా వుల్ హక్ తనదైన స్టైల్‌లో స్పందించాడు...


‘నా ఉద్దేశంలో 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో నా షాట్ చూసిన తర్వాత కొత్త షాట్స్ ఆడేందుకు పాక్ బ్యాటర్లు భయపడుతున్నారు. అంతకుముందు నేను కొట్టిన 15 ఫోర్లను అందరూ మరిచిపోయారు...

నేను కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఆడిన ఆ షాట్ మాత్రం అందరికీ గుర్తుండిపోయింది. జనాల్లో దేన్నీ అంత తేలిగ్గా మరిచిపోరు. ముఖ్యంగా ఇలా కొత్త షాట్స్ ఆడి అవుటైతే అస్సలు క్షమించరు...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ కెప్టెన్ మిస్బా వుల్ హక్...
 

2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యఛేదనలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్. అయితే మిస్బా వుల్ హక్ 38 బంతుల్లో 4 ఫోర్లతో 43 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు..

Joginder Sharma

విజయానికి చేరువగా వచ్చిన పాక్, జోగిందర్ శర్మ బౌలింగ్‌లో మిస్బా వుల్ హక్ రివర్స్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి శ్రీశాంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్క ావడంతో 19.3 ఓవర్లలో 152 పరుగులకి ఆలౌట్ అయ్యింది..

Latest Videos

click me!