ఐపీఎల్ 2021‌లో ఆర్‌సీబీకి ఊహించని షాక్... గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ దూరం...

First Published Aug 30, 2021, 10:24 AM IST

ఐపీఎల్ 2021 రెండో ఫేజ్ ఆరంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఊహించని షాక్ తగిలింది. భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా ఐపీఎల్ ఫేజ్ 2 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు...

ఆస్ట్రేలియా టూర్‌లో గబ్బా టెస్టులో ఎంట్రీ ఇచ్చిన వాషింగ్టన్ సుందర్, ఆ మ్యాచ్‌లో బాల్‌తో, బ్యాటుతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసి, శార్దూల్ ఠాకూర్‌తో కలిసి అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పాడు..

ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 96 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన వాషింగ్టన్ సుందర్, ఆ పర్ఫామెన్స్ కారణంగా ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపికయ్యాడు...

అయితే కౌంటీ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. రిజర్వు బెంచ్‌లోని ఆవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్.. టీమిండియా ఎలెవన్ తరుపున కాకుండా కౌంటీ ఎలెవన్ తరుపున ఆడారు...

ఈ ఇద్దరూ గాయపడి, టూర్ మొత్తానికి దూరమయ్యారు. సుందర్ గాయం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని వైద్యులు తేల్చడంతో, ఐపీఎల్ ఫేజ్ 2కి దూరం కాబోతున్నాడు వాషింగ్టన్ సుందర్...

ఐపీఎల్ 2021 ఫేజ్ 1లో 6 మ్యాచులు ఆడిన వాషింగ్టన్ సుందర్, బ్యాటుతో 31 పరుగులు చేయగా, బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. సుందర్ స్థానంలో బెంగళూరు ప్లేయర్ ఆకాశ్ దీప్‌ను రిప్లేస్‌మెంట్‌గా తీసుకుంది ఆర్‌సీబీ...

ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ఆరంభానికి ముందు జట్టులో చాలా మార్పులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా స్థానంలో భారత్, శ్రీలంక సిరీస్‌లో అదరగొట్టిన హసరంగను తీసుకుంది.

అలాగే కేన్ రిచర్డ్‌సన్ స్థానంలో మరో శ్రీలంక పేసర్ దుస్మంత ఛమీరాను, ఫిన్ ఆలెన్ స్థానంలో టిమ్ డేవిడ్‌ను తీసుకొచ్చిన ఆర్‌సీబీ, హెడ్ కోచ్‌ సిమన్ కటిచ్ స్థానంలో మైక్ హుస్సేన్‌ను తీసుకొచ్చింది...

click me!