రిటైర్మెంట్ ప్రకటించిన స్టువర్ట్ బిన్నీ... షార్ట్ క్రికెట్ కెరీర్‌లో రెండో అరుదైన రికార్డులతో...

First Published Aug 30, 2021, 10:04 AM IST

భారత ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ, 37 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా తరుపున 6 టెస్టులు, 14 వన్డేలు, ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడిన స్టువర్టట్ బిన్నీ, తన షార్ట్ కెరీర్‌లో రెండు అరుదైన రికార్డులను క్రియేట్ చేశాడు...

భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కొడుకైన స్టువర్ట్ బిన్నీ, ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 79 మ్యాచులు ఆడి 9 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలతో దాదాపు 4 వేల పరుగులు చేశాడు... బౌలింగ్‌లో 124 వికెట్లు తీశాడు...

82 లిస్టు ఏ మ్యాచులు ఆడిన స్టువర్ట్ బిన్నీ, 7 హాఫ్ సెంచరీలతో 1308 పరుగులు చేసి, బౌలింగ్‌లో 80 వికెట్లు పడగొట్టాడు..    

టీమిండియా తరుపున 6 టెస్టులు ఆడిన స్టువర్ట్ బిన్నీ, ఓ హాఫ్ సెంచరీతో 194 పరుగులు చేశాడు. మూడు వికెట్లు పడగొట్టాడు.. వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కలిగిన బౌలర్ కూడా స్టువర్ట్ బిన్నీయే...

2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చిన స్టువర్ట్ బిన్నీ, ఆరు వికెట్లు పడగొట్టి, అనిల్ కుంబ్లేని రికార్డును బ్రేక్ చేసి, టీమిండియా తరుపున బెస్ట్ గణాంకాలు నమోదుచేశాడు...

ఢాకాలో జరిగిన ఈ వన్డేలో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియాకి ఘోర ఓటమి తప్పదని భావిస్తున్న తరుణంలో బాల్‌తో మ్యాజిక్ చేసిన స్టువర్ట్ బిన్నీ, 4 పరుగులకే 6 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించాడు...

మహ్మద్ మితున్, ముస్తిఫిజుర్ రెమ్మాన్, మహ్మదుల్లా, నాసిర్ హుస్సేన్, మోర్తాజా, అల్‌ అమీన్ హుస్సేన్‌లను అవుట్ చేసిన స్టువర్ట్ బిన్నీ బౌలింగ్‌తో పాటు  మోహిత్ శర్మ 4 వికెట్లు తీయడంతో 58 పరుగులకే ఆలౌట్ అయ్యింది బంగ్లాదేశ్... 

2014 ఇంగ్లాండ్ టూర్‌లో తొలి టెస్టు ఆడిన స్టువర్ట్ బిన్నీ, మొదటి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే అవుటైనా, రెండ ఇన్నింగ్స్‌లో 78 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు...

క్రికెట్ యాంకర్ మయంతి లంగర్‌ను ప్రేమించి, 2012లో పెళ్లాడాడు స్టువర్ట్ బిన్నీ. వీరికి గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ కొడుకు కూడా జన్మించాడు...

చివరిసారిగా 2016లో వెస్టిండీస్‌పై తన కెరీర్‌లో ఏకైక టీ20 మ్యాచ్ ఆడిన బిన్నీ, ఆ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లతో 32 పరుగులు సమర్పించాడు...

టీమిండియా తరుపున వన్డేల్లో బెస్ట్ గణాంకాలు మాత్రమే కాకుండా, టీ20ల్లో అత్యంత ఖరీదైన ఓవర్ వేసిన బౌలర్‌గా చెత్త రికార్డు కూడా నమోదుచేసిన బిన్నీకి ఆ మ్యాచ్ తర్వాత మరో ఛాన్స్ దక్కలేదు...

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన స్టువర్ట్ బిన్నీ, 2020 ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదు...

click me!