అంతా మాహీ భాయ్ వల్లే, 2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఆడనందుకు... అంబటి రాయుడు కామెంట్స్...

Published : Dec 29, 2021, 01:28 PM IST

2019 వన్డే వరల్డ్‌ కప్ టోర్నీలో అంబటి రాయుడికి చోటు దక్కకపోవడంపై తీవ్ర వివాదం రేగిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో మిడిల్ ఆర్డర్ వైఫల్యం తర్వాత అంబటి రాయుడి సెలక్షన్ గురించి పెద్ద చర్చే జరిగింది..

PREV
112
అంతా మాహీ భాయ్ వల్లే, 2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఆడనందుకు... అంబటి రాయుడు కామెంట్స్...

టీమిండియా తరుపున 55 వన్డేలు ఆడి 47.06 సగటుతో 1,694 పరుగులు చేసిన అంబటి రాయుడు, నాలుగో స్థానంలో సెటిలైపోయాడు. అయితే వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీలో అంబటి రాయుడికి చోటు దక్కలేదు...

212

అతనికి బదులుగా విజయ్ శంకర్‌ని ఎంపిక చేసిన ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్క్ ప్రసాద్, అతను బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మూడు విధాలుగా జట్టుకి ఉపయోగపడతాడని కామెంట్ చేశాడు...

312

దానికి కౌంటర్‌గా ‘టీమిండియా మ్యాచులు చూసేందుకు 3డీ గ్లాసెస్ ఆర్డర్ చేశా...’ అంటూ అంబటి రాయుడు చేసిన ట్వీట్ పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది...

412

సెలక్టర్లపై కౌంటర్ చేయడంతో విజయ్ శంకర్, శిఖర్ ధావన్ వంటి ప్లేయర్లు గాయపడినా... వారి స్థానంలో అంబటి రాయుడిని కాదని రిషబ్ పంత్ వంటి ప్లేయర్లను ఎంపిక చేయడం జరిగిపోయాయి... 

512

దీంతో తీవ్ర మనస్థాపంతో అంబటి రాయుడు అర్ధాంతరంగా క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం, ఆ తర్వాత ఆవేశంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు నోరు కరుచుకోవడం జరిగిపోయాయి...  

612

ఐపీఎల్ 2018 టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన అంబటి రాయుడు, ఆ సీజన్‌లో 43 సగటుతో 16 మ్యాచుల్లో 602 పరుగులు చేసి, ధోనీ టీమ్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు...

712

ఓవరాల్‌గా చెన్నై సూపర్ కింగ్స్ తరుపున నాలుగు సీజన్లలో 61 మ్యాచుల్లో 1500 పరుగులు చేసిన అంబటి రాయుడు, వచ్చే సీజన్‌లో సీఎస్‌కే తనని తిరిగి కొనుగోలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు...

812

‘విజయ్ హాజారే ట్రోఫీలో ఆరు రోజుల గ్యాప్‌లో ఐదు వన్డే మ్యాచులు ఆడాను, నా ఫిట్‌నెస్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నా, ఈజీగా మరో మూడేళ్లు అయినా ఆడతాను..

912

2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో చోటు దక్కకపోవడంతో తీవ్రంగా నిరుత్సాహపడ్డాను. అయితే ఆ బాధను మరిచిపోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ బాగా సహకరించింది...

1012

వారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. సీఎస్‌కేతో నా అనుబంధం చాలా ప్రత్యేకమైనది. మేం రెండు టైటిల్స్ గెలిస్తే, నేను ఓ ఫైనల్ మ్యాచ్ ఆడాను. 2018 చాలా స్పెషల్ సీజన్...

1112

అది చెన్పై సూపర్ కింగ్స్‌కే కాదు, నాకు కూడా కమ్‌బ్యాక్ సీజన్ లాంటిది. నాలోని అత్యుత్తమ టాలెంట్‌ను బయటికి తీసుకొచ్చిన ఘనత మాత్రం ఎమ్మెస్ ధోనీకే దక్కుతుంది..

1212

నేను మాత్రమే కాదు, జట్టులోని ప్రతీ ఒక్కరినీ మాహీ చాలా ప్రభావితం చేస్తాడు. వారి నుంచి నూరు శాతం ఎలా రాబట్టాలో మాహీకి తెలుసు. టీమిండియాకి అత్యుత్తమ కెప్టెన్ అతనే...’ అంటూ కామెంట్ చేశాడు అంబటి రాయుడు...

Read more Photos on
click me!

Recommended Stories