ఏబీ డివిల్లియర్స్ ఆడిన చోటే, విరాట్ కోహ్లీ నూరో టెస్టు... గాయం కారణంగా మారిన...

Published : Jan 04, 2022, 09:46 AM IST

ప్రతీ క్రికెటర్ కెరీర్‌లో 100వ టెస్టు ఆడడం చాలా అరుదైన ఘనతే. అలాంటి తన కెరీర్ మైలురాయి టెస్టు మ్యాచ్‌ను స్వదేశంలో, అదీ ఆర్‌సీబీ పుట్టినిల్లు అయిన బెంగళూరు ఆడబోతున్నాడు విరాట్ కోహ్లీ...

PREV
112
ఏబీ డివిల్లియర్స్ ఆడిన చోటే, విరాట్ కోహ్లీ నూరో టెస్టు... గాయం కారణంగా మారిన...
Virat Kohli

80 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో 100 టెస్టులు ఆడిన క్రికెటర్ల సంఖ్య చాలా తక్కువ. ఇప్పటిదాకా కేవలం 11 మంది మాత్రం టీమిండియా తరుపున 100కి పైగా టెస్టులు ఆడగలిగారు...

212

జహీర్ ఖాన్, ఎమ్మెస్ ధోనీ, మహ్మద్ అజారుద్దీన్, రవిశాస్త్రి వంటి లెజెండరీ క్రికెటర్లు కూడా 100 టెస్టుల మైలురాయిని అందుకోలేకపోయారు...

312
Virat Kohli

సెంచూరియన్ టెస్టుతో కెరీర్‌లో 98 టెస్టులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, వెన్నునొప్పి కారణంగా జోహన్‌బర్గ్‌ టెస్టుకి దూరమైన విషయం తెలిసిందే...

412

రెండో టెస్టులో ఆడి ఉంటే, కేప్ టౌన్‌లో జరిగే మూడో టెస్టు మ్యాచ్... విరాట్ కోహ్లీ కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్ అయ్యేది. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి...

512

కేప్‌ టౌన్‌లో 99వ టెస్టు మ్యాచ్ ఆడనున్న విరాట్ కోహ్లీ, బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో కెరీర్‌లో నూరో టెస్టు ఆడే అవకాశం ఉంది...

612

సౌతాఫ్రికా టూర్ ముగించుకున్న తర్వాత స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్ ఆడే భారత జట్టు, ఆ తర్వాత శ్రీలంకతో రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచుల సిరీస్ ఆడనుంది...

712

విరాట్ కోహ్లీ ఆత్మీయ మిత్రుడు, స్నేహితుడు, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్ కూడా బెంగళూరులోనే తన కెరీర్‌లో నూరో టెస్టు ఆడడం విశేషం...

812

బెంగళూరులో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో నూరో టెస్టు ఆడిన ఏబీ డివిల్లియర్స్, 105 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 85 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

912

‘ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీకి బెంగళూరుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సొంతిల్లు లాంటి బెంగళూరులో తన నూరో టెస్టు ఆడబోతున్నాడు విరాట్... అదే అద్భుతమైన అనుభవం.

1012

పరిస్థితులు బాగుంటే ఈ మ్యాచ్‌కి జనాలను అనుమతించాలి. విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్‌కి 100వ టెస్టులో అభిమానుల హర్షధ్వనాలు ఉండాల్సిందే... ’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

1112

టీమిండియా తరుపున 200 టెస్టులు ఆడిన సచిన్ టెండూల్కర్ టాప్‌లో ఉంటే, రాహుల్ ద్రావిడ్ 163, వీవీఎస్ లక్ష్మణ్ 134, అనిల్ కుంబ్లే 132, కపిల్ దేవ్ 131, సునీల్ గవాస్కర్ 125 టెస్టులు ఆడారు...

1212

దిలీప్ వెంగ్‌సర్కార్ 116, సౌరవ్ గంగూలీ 113, ఇషాంత్ శర్మ 105, హర్భజన్ సింగ్ 103, వీరేంద్ర సెహ్వాగ్ 103 టెస్టులు ఆడారు. వీరిలో ఇషాంత్ శర్మ ఒక్కడే ఇంకా క్రికెట్‌లో కొనసాగుతున్నాడు...

Read more Photos on
click me!

Recommended Stories