ఐపీఎల్ 2022: అహ్మదాబాద్ హెడ్ కోచ్‌గా ఆశీష్ నెహ్రా, మెంటర్‌గా గ్యారీ కిర్‌స్టన్...

First Published Jan 4, 2022, 9:16 AM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న రెండు కొత్త జట్లూ, ఆరంభంతోనే అదరగొట్టాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నాయి. లక్నో టీమ్‌కి తగ్గట్టుగానే అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ కూడా కోచ్, సహాయక సిబ్బంది నియామకం విషయంలో భారీ ఎత్తులే వేస్తోంది...

ఐపీఎల్ 2022 సీజన్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న లక్నో ఫ్రాంఛైజీ మెంటర్‌గా గౌతమ్ గంభీర్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే...

టీ20 లీగ్ క్రికెట్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కోచ్ ఆండీ ఫ్లవర్, లక్నో టీమ్‌కి హెడ్‌ కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు... ఇప్పటికే ఈ ఇద్దరూ ఈ విషయాన్ని అధికారికంగా ఖరారు చేసేశాయి...

తాజాగా అహ్మదాబాద్ జట్టు హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశీష్ నెహ్రాని ఎంపిక చేసినట్టు సమాచారం...

టీమిండియా తరుపున 17 టెస్టులు, 120 వన్డేలు, 27 టీ20 మ్యాచులు ఆడిన ఆశీష్ నెహ్రా, ఓవరాల్‌గా 237 వికెట్లు పడగొట్టాడు...

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, పూణే వారియర్స్ ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి జట్లకి ఆడాడు ఆశీష్ నెహ్రా...

2018, 2019 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన ఆశీష్ నెహ్రా, క్రికెటర్‌గా కొనసాగినంత కాలం గాయాలతో తెగ ఇబ్బందిపడ్డాడు...

లక్నో టీమ్ బ్యాటింగ్ విభాగాన్ని పటిష్టంగా మార్చాలని చూస్తుంటే, ఓ ఫాస్ట్ బౌలర్‌ ఆశీష్ నెహ్రాని హెడ్ కోచ్‌గా నియమించడం ద్వారా అహ్మదాబాద్ జట్టు బౌలింగ్ విభాగంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు సిగ్నల్స్ ఇచ్చేసింది...

అలాగే 2011 వన్డే వరల్డ్‌కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన అప్పటి టీమిండియా హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌ను అహ్మదాబాద్ జట్టు మెంటర్‌గా ఎంచుకున్నట్టు సమాచారం...

లక్నో జట్టును ఆర్‌పీఎస్‌జీ గోయింకా గ్రూప్ కంపెనీ రూ.7090 కోట్లకు కొనుగోలు చేస్తే, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీని సీవీసీ క్యాపిటల్ రూ.5625 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే...

ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలు జరిపే సీవీసీ క్యాపిటల్ టీమ్‌కి ఐపీఎల్‌లో ఎంట్రీ దక్కకపోవచ్చని కొన్నాళ్లు సస్పెన్స్ నడిచినా, బీసీసీఐ ఆ జట్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది...

click me!