రహానే, పూజారాకి ఇచ్చినన్ని అవకాశాలు, ఆ కరణ్ నాయర్‌కి ఇచ్చి ఉంటే... సెహ్వాగ్, యువీ విషయంలోనూ...

First Published Jan 3, 2022, 4:56 PM IST

టీమిండియాలో ప్లేస్ దక్కించుకోవడం చాలా కష్టం. వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకుని, ఆ స్థానాన్ని పదిలంగా కాపాడుకోవడం మరీ కష్టం. అయితే వరుసగా విఫలం అవుతున్నా ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానేకి మాత్రం ఛాన్సుల మీద ఛాన్సులు ఇస్తోంది భారత జట్టు...

నాలుగేళ్లుగా అజింకా రహానే టెస్టు సగటు ఏటికేటికీ తగ్గుతూ వస్తోంది. మెల్‌బోర్న్ టెస్టు సెంచరీ తర్వాత గత 11 టెస్టుల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేకపోయాడు అజింకా రహానే...

‘నయా వాల్’గా పేరొందిన ఛతేశ్వర్ పూజారా, టెస్టుల్లో సెంచరీ మార్కు అందుకుని దాదాపు మూడేళ్లు కావస్తోంది. సెంచరీ చేయకపోయినా అప్పుడప్పుడూ హాఫ్ సెంచరీలు చేస్తూ నెట్టుకొస్తున్నాడు పూజారా...

రెండేళ్ల క్రితం భారత జట్టుకి ఓపెనింగ్ సమస్య ఉండేది. మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉండేది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్ అదరగొడుతుంటే మిడిల్ ఆర్డర్ విఫలమవుతోంది...

సెంచూరియన్ టెస్టు మొదటి రోజు 272/3 స్కోరు చేసిన టీమిండియా, 327 పరుగులకే ఆలౌట్ అవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. అయితే ఈ ఇద్దరికీ ఇచ్చినన్ని అవకాశాలు... కరణ్ నాయర్ లాంటి ప్లేయర్‌కి ఎందుకివ్వలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది...

తన కెరీర్‌లో రెండో టెస్టులోనే త్రిబుల్ సెంచరీ చేసి, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టీమిండియా తరుపున ఈ మార్కు అందుకున్న రెండో ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు కరణ్ నాయర్..

అయితే ఆ మ్యాచ్ తర్వాత అతనికి వచ్చిన అవకాశాలు నాలుగంటే నాలుగు టెస్టులు. నాలుగు టెస్టుల్లో పెద్దగా రాణించలేకపోయాడని కరణ్ నాయర్‌ని పట్టించుకోవడం మానేశారు సెలక్టర్లు...

అలాగే టీమిండియాకి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్న వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ వంటి ప్లేయర్లు కూడా కెరీర్ ముగింపు దశలో జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది...

టెస్టుల్లో రెండు త్రిబుల్ సెంచరీలు, 23 సెంచరీలు చేసిన వీరేంద్ర సెహ్వాగ్ కూడా మూడు, నాలుగు టెస్టుల్లో విఫలమయ్యారని నిర్ధాక్షిణ్యంగా జట్టు నుంచి తొలగించింది టీమ్ మేనేజ్‌మెంట్...

యువరాజ్ సింగ్ లాంటి మ్యాచ్ విన్నర్‌కి కూడా టీమిండియా ఇంతగా సహకరించింది లేదు. అలాంటిది రహానే, పూజారా వరుసగా విఫలమవుతున్నా, ఇన్ని అవకాశాలు ఇవ్వడం ఏంటని నిలదీస్తున్నారు...

రహానే, పూజారాలకు ఇచ్చిన అవకాశాలను సగం ఛాన్సులు, కరణ్ నాయర్ లాంటి యంగ్ ప్లేయర్‌కి ఇచ్చి ఉంటే ఈపాటికి మరో రెండు త్రిబుల్ సెంచరీలు చేసేవాడని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
 

click me!