కోహ్లీ కావాలనే ఓడిపోయేలా ఆడినట్టున్నాడు... విరాట్‌పై వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్...

First Published | Oct 26, 2020, 7:33 PM IST

IPL 2020 సీజన్‌లో మంచి ప్రదర్శన ఇస్తూ ప్లేఆఫ్ రేసులో నిలిచింది రాయల్ ఛాలెంజ్స్ బెంగళూరు. 11 మ్యాచుల్లో ఏడింట్లో గెలిచిన విరాట్ సేన, మరో విజయం సాధిస్తే నేరుగా ప్లేఆఫ్ చేరుకుంటుంది. అయితే గత మ్యాచ్‌లో జిడ్డు ఆటతీరుతో విమర్శలపాలైంది ఆర్‌సీబీ.

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 145 పరుగుల స్వల్ప స్కోరుకి పరిమితమైంది.
ఎలాంటి బౌలర్లనైనా చీల్చి చెండాడగలిగేటాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ క్రీజులో ఉండి కూడా పెద్దగా బౌండరీలు రాలేదు.

43 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసినా భారీ స్కోరు చేయాలనే ఆసక్తి విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్‌ బ్యాటింగ్‌లో కనిపించలేదన్నాడు వీరూ.
7వ ఓవర్ నుంచి 18వ ఓవర్ వరకూ ఈ ఇద్దరూ బ్యాటింగ్ చేసినా... కేవలం 82 పరుగుల భాగస్వామ్యం మాత్రమే వచ్చింది.
దీనిపై సెటైరికల్‌గా స్పందించాడు వీరేంద్ర సెహ్వాగ్. ‘ఇన్ని ఓవర్లు బ్యాటింగ్ చేసి కూడా పరుగులు రాబట్టలేకపోయారు. జిడ్డు బ్యాటింగ్ చేడలేక పడుకుండిపోయాను. నేను నిద్ర లేచిన తర్వాత కూడా వారి బ్యాటింగ్ అలాగే సాగింది....
మహేంద్ర సింగ్ ధోనీ మీద ఉన్న గౌరవంతో విరాట్ కోహ్లీ కావాలనే ఓడిపోవాలని ఆడినట్టు అనిపించింది... బౌలింగ్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేసి మరోసారి మ్యాజిక్ చూపించాడు ధోనీ... అన్నాడు వీరూ.
స్వల్ప లక్ష్యచేధనలో అద్భుత హాఫ్ సెంచరీ చేసి స్పార్క్ చూపించిన రుతురాజ్ గైక్వాడ్‌కి ప్రశంసలు అందించాడు వీరేంద్ర సెహ్వాగ్.
వరుస మ్యాచుల్లో చిత్తుగా ఓడిపోతూ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కి ఓ ఊరట విజయం ఇవ్వాలనే కోహ్లీ ఇలా ఆడి ఉంటాడని అనుమానిస్తున్నారు ఐపీఎల్ అభిమానులు.
ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో 52 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 90 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ...
గత మ్యాచ్‌లో కేవలం ఒకే ఫోర్, ఒకే సిక్సర్‌తో 43 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు విరాట్ కోహ్లీ....

Latest Videos

click me!