KKRvsKXIP: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పర్ఫామెన్స్‌కి అతనే ప్రధాన కారణం...

First Published Oct 26, 2020, 6:31 PM IST

IPL 2020 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పర్ఫామెన్స్‌ వేరే రేంజ్. మొదటి ఏడు మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న పంజాబ్... గేల్ ఎంట్రీ తర్వాత అదరగొడుతూ వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచింది. ఈ పర్ఫామెన్స్ అంతటికీ కోచ్ అనిల్ కుంబ్లేనే కారణం అంటున్నాడు సునీల్ గవాస్కర్.

ఈజీగా గెలుస్తుందనుకున్న మ్యాచుల్లో కూడా ఘోరంగా విఫలమై ఫస్ట్ హాఫ్‌లో చెత్త ప్రదర్శన ఇచ్చింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
undefined
జట్టులోకి ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా విజయాలు అందుకుంటూ అనూహ్యంగా ప్లేఆఫ్ రేసులోకి దూసుకొచ్చింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
undefined

Latest Videos


అనిల్ కుంబ్లేకి పోరాటతత్వం చాలా ఎక్కువ. అంత తేలిగ్గా ఓటమిని ఒప్పుకోవడానికి ఇష్టపడడు కుంబ్లే... పంజాబ్ కూడా అదే నేర్చుకుంది...
undefined
దవడకు దెబ్బతగిలినా, వెనుకడుగు వేయకుండా కట్టుకట్టుకుని బౌలింగ్ చేశాడు అనిల్ కుంబ్లే. ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌లోనూ అదే నమ్మకం కనిపిస్తోంది... అన్నాడు సునీల్ గవాస్కర్.
undefined
ప్రస్తుతం 11 మ్యాచుల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. నేడు పంజాబ్, కోల్‌కత్తా మ్యాచ్ వారికి కీలకం కానుంది.
undefined
నేటి మ్యాచ్ గెలిస్తే కోల్‌కత్తా ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది. అందుకే ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే పంజాబ్ నేటి మ్యాచ్‌తో పాటు మిగిలిన రెండు మ్యాచుల్లోనూ గెలవాల్సి ఉంటుంది.
undefined
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ పూర్తిగా రాటుదేలడని, వరుస ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నాడని తెలిపాడు సన్నీ గవాస్కర్.
undefined
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేఆఫ్ వెళ్లాలంటే కూడా కేకేఆర్ ఆడబోయే‌ మ్యాచ్ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
undefined
అయితే కెఎల్ రాహుల్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఊపు చూస్తుంటే ప్లేఆఫ్ రేసులో కచ్ఛితంగా ఉంటుందని అనిపిస్తోందని తెలిపాడు సునీల్ గవాస్కర్.
undefined
ముంబై ఇండియన్స్‌పై డబుల్ సూపర్ ఓవర్ గేమ్‌లో గెలిచిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. అయితే చివరి మూడు మ్యాచుల్లో భారీ తేడాతో గెలిచి ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోవడంకష్టమే.
undefined
click me!