పబ్లిక్‌గా ఫోన్ నెంబర్ షేర్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్... కాల్ చేసిన ఫ్యాన్స్‌కి షాక్...

First Published Aug 3, 2021, 3:03 PM IST

అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉంటున్నాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. ధనాధన్ ఆటతీరుతో వీరబాదుడు వీరూగా గుర్తింపు తెచ్చుకున్న సెహ్వాగ్, పబ్లిక్‌గా ఫోన్ నెంబర్ షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు...

‘నా ఫోన్ స్నానం చేస్తుంటే షవర్‌లో పడిపోయింది. అది రిపేర్‌కి ఇచ్చా... నాకు ఈ నెంబర్‌కి కాల్ చేయండి...’ అంటూ 9112083319 నెంబర్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...

ఎంత ఫోన్ పనిచేయకపోయినా, పబ్లిక్‌గా సోషల్ మీడియాలో అలా ఫోన్ నెంబర్ షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మరికొందరు సెహ్వాగ్ ఫ్యాన్స్ అయితే, ఎలాగైతేనేం వీరూ నెంబర్ దొరికిందనుకుని సంబరపడిపోయారు...

చాలామంది వీరూ పోస్ట్ చేసిన నెంబర్‌కి కాల్ చేయగా... అది ఓ వెబ్‌సైట్‌కి సంబంధించిన నెంబర్‌గా తేలింది. మరి వీరూ ఈ నెంబర్‌ని ఎందుకు పోస్టు చేశాడంటే... అందులో చాలా పెద్ద కథే ఉంది...

వీరూ పోస్టు చేసిన నెంబర్‌లో మొదటి రెండు నెంబర్లు 91... భారత క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన బ్యాట్స్‌మెన్ సెహ్వాగ్. వీరూ టెస్టు సిక్సర్ల సంఖ్య 91... 

ఆఖరి మూడు సంఖ్య 319... వీరేంద్ర సెహ్వాగ్‌కి టెస్టుల్లో అత్యుత్తమ స్కోరు. టీమిండియా తరుపున రెండు త్రిబుల్ సెంచరీలు, అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదుచేసిన బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌యే..

మధ్యలో ఉన్న 83... 2008లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సెహ్వాగ్ చేసిన పరుగులు. మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమైన చోట నాలుగో రోజు ఆఖరి సెషన్‌లో 68 బంతుల్లో 83 చేసిన వీరేంద్ర సెహ్వాగ్, భారత జట్టుకి అద్వితీయ విజయాన్ని అందించాడు. 

ఈ మ్యాచ్‌లో సచిన్ సెంచరీ చేసినప్పటికీ, దూకుడుగా ఆడి మ్యాచ్‌‌ను మలుపు తిప్పిన వీరూ ఇన్నింగ్స్ చాలా స్పెషల్ కావడంతో అతనికే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది...

ఆ తర్వాతి మూడు నెంబర్లు 120... ఐపీఎల్‌లో వీరేంద్ర సెహ్వాగ్ అత్యుత్తమ స్కోరు 122. ఈ సంఖ్యను మరిచిపోయి వీరూ 120 పోస్టు చేసి ఉంటాడని భావిస్తున్నారు అభిమానులు. మరికొందరతై తన పుట్టినరోజు అక్టోబర్ 20కి గుర్తుగా దీన్ని పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.

అవన్నీ కాదు, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్ పట్టిన క్యాచుల సంఖ్య 120కి గుర్తుగా దీన్ని చేర్చాడనేవాళ్లూ ఉన్నారు... వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు రిటైర్మెంట్ ప్రకటించిన రోజు కూడా అక్టోబర్ 20...

ఇవన్నీ కాదు, ఏదైనా ప్రమోషన్‌లో భాగంగా వీరేంద్ర సెహ్వాగ్ ఇలా చేసి ఉండవచ్చని, లేదా ఎవరైనా అకౌంట్‌ను హ్యాక్ చేసి ఉండవచ్చని అనుమానిస్తూ వీరూ పోస్టు కింద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు..

112- 2002లో న్యూజిలాండ్‌ టూర్‌లో జరిగిన ఆరో వన్డేలో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన పరుగులు...మిగిలిన ప్లేయర్లు అంతా విఫలమైనప్పుడు సెహ్వాగ్ 112 పరుగులు చేయడంతో భారత జట్టు 1 వికెట్ తేడాతో గెలిచింది.

083- 2008లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సెహ్వాగ్ చేసిన 83 పరుగులు అని కూడా డీకోడ్ చేసే పనిలో పడ్డారు అభిమానులు...

click me!