అతని బౌలింగ్‌‌కి భయపడి సచిన్‌ని ఓపెనింగ్ చేయమన్నా! పండిత్ జీ అలా చెప్పాడని.. - వీరేంద్ర సెహ్వాగ్...

Published : Jan 15, 2023, 10:19 AM IST

అభిమానులతో క్రికెట్ దేవుడిగా కీర్తించబడిన భారత మాజీ క్రికెటర్ ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్‌కి సెంటిమెంట్స్, నమ్మకాలు చాలా ఎక్కువ. వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి రికార్డు లెవెల్లో పరుగుల ప్రవాహం సృష్టించిన సచిన్ టెండూల్కర్... 2003 వన్డే వరల్డ్ కప్‌లో దుమ్మురేపాడు...

PREV
19
అతని బౌలింగ్‌‌కి భయపడి సచిన్‌ని ఓపెనింగ్ చేయమన్నా! పండిత్ జీ అలా చెప్పాడని.. - వీరేంద్ర సెహ్వాగ్...


2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో 11 మ్యాచుల్లో 61.18 సగటుతో 89.25 స్ట్రైయిక్ రేటుతో 673 పరుగులు చేశాడు సచిన్ టెండూల్కర్. 20 ఏళ్లుగా సచిన్ టెండూల్కర్ ఈ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. 2019 వన్డే వరల్డ్ కప్‌లో ఐదు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ, సచిన్ రికార్డుకి చేరువగా వచ్చినా ‘మాస్టర్’ని అందుకోలేకపోయాడు...

29
Sehwag-Ganguly

‘కెరీర్ ఆరంభంలో లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ల బౌలింగ్‌ని ఎదుర్కోవడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాడు. చమందా వాస్, నాథన్ బ్రాకెన్ బౌలింగ్‌లో మొదటి బాల్‌కే అవుట్ అయ్యాను. అందుకే 2003 వన్డే వరల్డ్ కప్‌లో వసీం భాయ్ (వసీం అక్రమ్)ని ఫేస్ చేయడానికి భయపడ్డాను..

39

వాళ్లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్‌లో సచిన్ టెండూల్కర్‌ దగ్గరికి వెళ్లి స్ట్రైయిక్ తీసుకోమ్మని అడిగాను. ‘చూడండి. వసీం ఫస్ట్ ఓవర్ బౌలింగ్ చేస్తే నేను మొదటి బంతికే అవుటైపోతానేమో. కాబట్టి మీరు స్ట్రైయిక్ తీసుకోండి...’ అని చెప్పాను...

49


దానికి సచిన్ టెండూల్కర్.. ‘లేదు.. లేదు. నేను చేయలేను. మా పండిత్ జీ, రెండో స్థానంలోనే బ్యాటింగ్ చేయమని చెప్పాను. ఓపెనింగ్ చేస్తే నాకు మంచిది కాదు...’ అని చెప్పారు. నేను, ఆయన మాటలకు షాక్ అయ్యాను. ‘మీరు వరల్డ్ నెం.1 బ్యాటర్. మీరు పండిత్ జీ గురించి మాట్లాడుతున్నారు...’ అని అన్నాను...

59
Sachin Sehwag

ఆయన మాత్రం ‘లేదు.. నేను రెండో స్థానంలోనే బ్యాటింగ్ చేస్తాను. నువ్వు స్ట్రైయిక్ తీసుకోవాల్సిందే..’ అని తేల్చి చెప్పేశారు. సెంచూరియన్‌లో మ్యాచు. చాలా మెట్లు ఎక్కి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాం. లంచ్ చేశాక వచ్చి మళ్లీ సచిన్ టెండూల్కర్‌ని రిక్వెస్ట్ చేశా...

69

ఆయన పెద్ద హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఏవో పాటలు వింటున్నారు. నేను పక్కన రిక్వెస్ట్ చేస్తూ కూర్చున్నా...  ఒకదాన్ని తీసి, నన్ను వీపు మీద కొట్టారు. ‘వెళ్లి, ప్యాడ్స్ కట్టుకో. నేను స్ట్రైయిక్ తీసుకోను.. ’ అని చెప్పేశారు. నేను మాత్రం వసీం అక్రమ్‌ నుంచి కాపాడమని టెండూల్కర్‌ని కోరుతూనే ఉన్నా...

79

క్రీజులోకి 30 యాడ్స్ వరకూ వెళ్లే వరకూ సచిన్‌ని అడుగుతూనే ఉన్నా. ఆయన నో చెబుతూనే ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో సడెన్‌గా వికెట్ కీపర్‌ దగ్గరకి వెళ్లి నిల్చున్నారు. నేను షాక్ అయ్యా.. వావ్, ఈరోజు నా లక్కీ డే... అని సంతోషంతో మురిసిపోయా...

89

ఆయన స్ట్రైయిక్ తీసుకుని, ఫస్ట్ బాల్‌కి సింగిల్ తీశారు. రెండో బాల్‌కే వసీం బాయ్‌ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదటి బాల్‌కే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నందుకు సంతోషించా...’ అంటూ చెప్పుకొచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్...

99

2003 వన్డే వరల్డ్ కప్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 273 పరుగుల భారీ స్కోరు చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ 14 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసి వకార్ యూనిస్ బౌలింగ్‌లో అవుట్ కాగా సచిన్ టెండూల్కర్ 75 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 98 పరుగులు చేసి సెంచరీకి 2 పరుగుల దూరంలో అక్తర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. గంగూలీ డకౌట్ కాగామహ్మద్ కైఫ్ 35, రాహుల్ ద్రావిడ్ 44, యువరాజ్ సింగ్ 50 పరుగులు చేసి టీమిండియాకి 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందించారు.. 
 

click me!

Recommended Stories