ఐపీఎల్‌లోకి వీరేంద్ర సెహ్వాగ్ మేనల్లుడు మయాంక్... మార్కో జాన్సెన్ కవల సోదరుడు డువాన్...

First Published Dec 24, 2022, 11:57 AM IST

ఐపీఎల్ 2023 మినీ వేలంలో రికార్డు బ్రేకింగ్‌గా సాగింది. 16 ఏళ్ల చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్లుగా మునుపటి రికార్డులను బ్రేక్ చేశారు సామ్ కుర్రాన్, కామెరూన్ గ్రీన్. కేవలం ముగ్గురు ప్లేయర్ల కోసం రూ.52 కోట్లకు పైగా ఖర్చు చేశాయి ఫ్రాంఛైజీలు...

ఐపీఎల్ 2023 మినీ వేలంలో కొత్త కుర్రాళ్లు, అన్‌క్యాప్డ్ ప్లేయర్లు కూడా లక్కీ ఛాన్స్ కొట్టేశారు. ముంబై ఇండియన్స్ జట్టు ఇంగ్లీష్ అక్షరం ‘J’ ఉన్న ఫాస్ట్ బౌలర్లను కొనడానికి ఆసక్తి చూపించింది. జస్ప్రిత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, జాసన్ బెహెండ్రాఫ్ ఇప్పటికే టీమ్‌లో ఉండగా తాజాగా వీరిలో జే రిచర్డ్‌సన్ చేరాడు...

సన్‌రైజర్స్ హైదరబాద్ జట్టు ‘మయాంక్’ మాయలో పడింది. భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ని రూ.8 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్, స్పిన్నర్ మయాంక్ మర్కండేని రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. మయాంక్ దగర్‌ని రూ.1 కోటి 80 లక్షలకు కొనుగోలు చేసింది ఆరెంజ్ ఆర్మీ...

ఆల్‌రౌండర్ మయాంక్ జితేందర్ దగర్, 2016 అండర్19 వరల్డ్ కప్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2018 వేలంలో పంజాబ్ జట్టు, దగర్‌ని కొనుగోలు చేసింది. అయితే ఇప్పటిదాకా ఆడే అవకాశం మాత్రం రాలేదు...

బీసీసీఐ నిర్వహించే యో-యో టెస్టులో 19.3 పాయింట్లు తెచ్చుకున్న మయాంక్ దగర్, మనీశ్ పాండే 19.2 రికార్డును బ్రేక్ చేశాడు. ఢిల్లీలో పుట్టి పెరిగిన దగర్, భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌కి మేనల్లుడు. మయాంక్ దగర్ తల్లి, వీరేంద్ర సెహ్వాగ్‌కి అక్క అవుతుంది...

ఐపీఎల్ 2023 సీజన్‌లో కవల పిల్లలు ప్రత్యర్థులుగా తలబడబోతున్నాడు. సౌతాఫ్రికా యంగ్ ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సెన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. మార్కో కవల సోదరుడు డువాన్, ఐపీఎల్ 2023 వేలంలో అమ్ముడుపోయాడు.. డువాన్ జాన్సెన్‌ని ముంబై ఇండియన్స్ జట్టు బేస్ ప్రైజ్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది..

ఐపీఎల్‌లో ఇంతకుముందు ఇర్పాన్ పఠాన్- యూసఫ్ పఠాన్, హార్ధిక్ పాండ్యా- కృనాల్ పాండ్యా,మైక్ హుస్సీ- డేవిడ్ హుస్సీ, ఆల్బీ మోర్కెల్- మోర్నీ మోర్కెల్,  దీపక్ చాహార్- రాహుల్ చాహార్, సామ్ కుర్రాన్- టామ్ కుర్రాన్ వంటి సోదరులు తలపడినా కవల సోదరులు ఆడడం మాత్రం ఇదే తొలిసారి..

click me!