ఐపీఎల్‌లోకి తొలిసారి ఐర్లాండ్, నమీబియా ప్లేయర్లు... జింబాబ్వే స్టార్ సికిందర్ రజాకి దక్కిన ఛాన్స్...

First Published Dec 24, 2022, 10:12 AM IST

ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ ఆడడాన్ని చాలా గొప్ప గౌరవంగా భావిస్తారు ప్రపంచదేశాల క్రికెటర్లు... ఐపీఎల్ కంటే పీఎస్‌ఎల్ తోపు అంటూ మాటలు చెప్పినా, ఐపీఎల్ ఆడే ఛాన్స్ రాక పాక్ క్రికెటర్లు ఎంత ఫీలవుతున్నారో అందరికీ తెలిసిందే..  ఐపీఎల్ 2023 మినీ వేలంలో అసోసియేట్ ప్లేయర్లకు అవకాశం దక్కింది...

Sikandar Raza

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించే ఫ్రాంఛైజీలు, వెస్టిండీస్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ దేశాల ప్లేయర్లకు కూడా భారీ ధర పెట్టేందుకు సిద్ధంగా ఉంటాయి. అయితే అసోసియేట్ దేశాల క్రికెటర్లకు మాత్రం ఐపీఎల్‌లో నిరాశ ఎదురవుతూ వచ్చింది...

Joshua Little

ఈసారి ఏకంగా మూడు అసోసియేట్ దేశాల నుంచి ముగ్గురు ప్లేయర్లు, ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోవడం విశేషం.. ఇండియా, ఐర్లాండ్ మధ్య జరిగిన సిరీస్‌లో అద్భుతంగా అదరగొట్టిన జోషువా లిటిల్‌ని రూ.4.4 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్...

ireland

ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోయిన మొట్టమొదటి ఐర్లాండ్ క్రికెటర్‌గా జోషువా లిటిల్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇయాన్ మోర్గాన్, ఐర్లాండ్ తరుపున ఆరంగ్రేటం చేసినా ఇంగ్లాండ్‌కి మారాడు. దాంతో అతను ఇంగ్లాండ్ ప్లేయర్‌గానే ఐపీఎల్ ఆడాడు...

David Wiese

ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన మొట్టమొదటి నమీబియా ప్లేయర్‌గా డేవిడ్ వీస్ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ 2023 మినీ వేలంలో రూ.1 కోటికి డేవిడ్ వీస్‌ని కొనుగోలు చేసింది కేకేఆర్. అయితే ఇంతకుముందు సౌతాఫ్రకా ప్లేయర్‌గా ఆర్‌సీబీ తరుపున మ్యాచులు ఆడాడు డేవిడ్ వీస్. 2013లో సౌతాఫ్రికా తరుపున అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన డేవిడ్ వీస్, 2021లో నమీబియాకి మారాడు...

sikandar raza

జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజాకి ఎట్టకేలకు ఐపీఎల్ ఆహ్వానం దక్కింది. ఇండియా, జింబాబ్వే మధ్య జరిగిన సిరీస్‌లో రజా పర్ఫామెన్స్‌కి మెచ్చిన  పంజాబ్ కింగ్స్, అతన్ని బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకే దక్కించుకుంది...

ఐపీఎల్‌లో అమ్ముడుపోయిన మూడో జింబాబ్వే ప్లేయర్ సికిందర్ రజా. ఇంతకుముందు 2008లో తతేంద్ర టైబు, కేకేఆర్ తరుపున 3 మ్యాచులు ఆడగా, బ్రెండన్ టేలర్‌ని 2014లో సన్‌రైజర్స్‌ కొనుగోలు చేసింది. అయితే టేలర్‌కి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు. 2011లో రిప్లేస్‌మెంట్‌గా జింబాబ్వే ప్లేయర్ రే ప్రైస్‌, ముంబై తరుపున ఓ మ్యాచ్ ఆడాడు...

జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్స్ ముజరబానీకి ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కుతుందని భావించారంతా. అయితే అతన్ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు. అలాగే స్కాట్లాండ్, నెదర్లాండ్స్ వంటి జట్ల ప్లేయర్లకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది.. 

click me!