అప్పుడు 14, ఇప్పుడు 2... ఐపీఎల్ వేలంలో భారీగా పడిపోయిన ప్లేయర్లు వీరే! కేన్ మామ ఫస్టు...

First Published Dec 24, 2022, 10:45 AM IST

ఐపీఎల్ కూడా సినిమా ఇండస్ట్రీ లాంటిదే. భారీ అంచానాలతో మెగా బడ్జెట్‌తో తీసిన సినిమా, బాక్సాఫీస్ దగ్గర ఢమాల్ అంటే... ఆ హీరో తర్వాతి ప్రాజెక్టుపై దాని ప్రభావం పడుతుంది. ఐపీఎల్‌లోనూ అంతే. గత సీజన్‌లో రూ.10-14 కోట్లకు పైగా దక్కించుకున్న ప్లేయర్లు, ఈసారి బేస్ ప్రైజ్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది...

ఎన్నో అంచనాలతో కోట్లు కుమ్మరించి కొన్న ప్లేయర్ ఫెయిల్ అయితే, అతన్ని అట్టిపెట్టుకోవడానికి ఫ్రాంఛైజీలు ఇష్టపడవు... అలా గత సీజన్‌లో భారీ ధర దక్కించుకుని, ఐపీఎల్ 2023 మినీ వేలంలో బేస్ ప్రైజ్‌కి పరిమితమైన ప్లేయర్లలో టాప్‌లో నిలిచాడు కేన్ విలియంసన్...

Image credit: PTI

డేవిడ్ వార్నర్‌ని సాగనంపి, రూ.14 కోట్లతో కేన్ విలియంసన్‌ని రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. గత సీజన్‌లో అతని డిజాస్టర్ పర్ఫామెన్స్ ఇవ్వడంతో వేలానికి వదిలేసింది. కేన్ విలియంసన్‌ని గుజరాత్ టైటాన్స్ బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది... 

ఐపీఎల్ 2021 సీజన్‌లో రూ.14 కోట్లు దక్కించుకున్న ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్‌సన్, ఈసారి రూ.1.5 కోట్ల బేస్ ప్రైజ్ మాత్రమే దక్కించుకోగలిగాడు. జే రిచర్డ్‌సన్‌ని బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్..

ఐపీఎల్ 2021 సీజన్‌లో రూ.15 కోట్లు దక్కించుకున్న న్యూజిలాండ్ పేసర్ కేల్ జెమ్మీసన్‌కి ఈసారి బేస్ ప్రైజ్ మాత్రమే దక్కింది. జెమ్మీసన్‌ని బేస్ ప్రైజ్ రూ.1 కోటికి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

2022 మెగా వేలంలో రూ.7 కోట్ల 50 లక్షలకు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్‌ని కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అతనికి మినీ వేలంలో బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్...

గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ఇద్దరు ప్లేయర్లలో మయాంక్ అగర్వాల్ ఒకడు. గత సీజన్‌లో రూ.14 కోట్లు తీసుకున్న మయాంక్ అగర్వాల్‌, ఈసారి వేలంలో రూ.8.25 కోట్లు దక్కించుకున్నాడు. కెప్టెన్ కేన్ విలియంసన్‌ని సాగనంపిన సన్‌రైజర్స్, మయాంక్ అగర్వాల్‌ని వేలంలో కొనుగోలు చేసింది..

Odean Smith

ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.6 కోట్లకు అమ్ముడుపోయిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఓడియన్ స్మిత్‌, ఈసారి బేస్ ప్రైజ్ మాత్రమే దక్కించుకోగలిగాడు. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి ఆడిన ఓడియన్ స్మిత్‌ని రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్.. 

click me!