అవన్నీ పుకార్లే.. చీఫ్ సెలక్టర్ రేసులో నేను లేను : వీరేంద్ర సెహ్వాగ్

Published : Jun 23, 2023, 01:30 PM ISTUpdated : Jun 23, 2023, 01:47 PM IST

BCCI: నార్త్ జోన్ నుంచి  సెలక్టర్ పదవి ఖాళీగా ఉండటంతో ఆ స్థానాన్ని వీరేంద్ర సెహ్వాగ్ తో భర్తీ చేయించి అతడికే  సెలక్షన్ కమిటీ  ఛైర్మన్‌ పోస్ట్ కూడా దక్కనుందని వార్తలు వచ్చాయి.

PREV
16
అవన్నీ  పుకార్లే.. చీఫ్ సెలక్టర్ రేసులో నేను లేను : వీరేంద్ర సెహ్వాగ్

టీమిండియా  మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్  ఆలిండియా  సెలక్షన్ కమిటీ  చీఫ్ కాబోతున్నాడంటూ గడిచిన రెండు  మూడు రోజులుగా వస్తున్న వార్తలపై  అతడు స్పందించాడు.   బీసీసీఐ తనకు ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదని, బయిట వస్తున్న వార్తలన్నీ వదంతులేనని  తేల్చి చెప్పాడు. 

26

సెహ్వాగ్ కు  బీసీసీఐ  భారీ ఆఫర్ ఇచ్చిందని..  అయితే చీఫ్ సెలక్టర్ అవడానికి అన్ని అర్హతలు ఉన్న వీరూకు బోర్డుకు  మధ్య వేతనం దగ్గరే అసలు చిక్కు వస్తుందన్నట్టు కూడా గుసగుసలు వినిపించాయి.   

36

వాస్తవానికి  బీసీసీఐ చీఫ్ సెలక్టర్ కు బోర్డు వార్షిక వేతనం కింద కోటి రూపాయలను చెల్లిస్తోంది.  కమిటీలో ఉండే మిగిలిన నలుగురికీ  రూ. 90 లక్షలను  అందజేస్తున్నది.   వీరూ మాత్రం అంత  తక్కువ వేతనానికి   రాలేనని  బీసీసీఐ తో చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి.  వీరూను ఎలాగైనా చీఫ్  సెలక్టర్ ను చేయాలన్న పట్టుదలతో ఉన్న  బీసీసీఐ..  నిబంధనలను  మార్చడానికి కూడా  రెడీగా ఉన్నట్టు  వార్తలు వచ్చాయి.  

46

తాజాగా వీటన్నింటికీ వీరూ  తన ఆన్సర్ తో చెక్ పెట్టాడు.  వీరూకు  బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పోస్ట్ ఆఫర్ ఇచ్చిందా..? అని టైమ్స్ ఆఫ్ ఇండియా అతడిని ప్రశ్నించింది.   దానికి  వీరూ స్పందిస్తూ.. ‘లేదు’  అని సింపుల్ గా చెప్పేశాడు.  మరి వీరూ  కాకపోతే కొత్త సెలక్టర్ ఎవరవుతారని టీమిండియా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

56

ప్రస్తుతం సెలక్షన్ కమిటీలో   శ్రీధరన్ శరత్ (సౌత్ జోన్), సుబ్రతో బెనర్జీ (సెంటర్ జోన్), సలిల్ అంకోలా  (వెస్ట్ జోన్) లతో పాటు తాత్కాలిక చీఫ్ సెలక్టర్ గా శివ సుందర్ దాస్  ఉన్నాడు.  చేతన్ శర్మ నార్త్ జోన్ నుంచి ప్రాతినిథ్యం వహించేవాడు.  ఇప్పుడు బీసీసీఐ ఇదే పోస్టును భర్తీ చేయనుంది.  

66

2015లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న వీరేంద్ర సెహ్వాగ్‌కి, రవిశాస్త్రి తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవిని ఆశ చూపించినా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు.ప్లేయర్‌గా సంపాదించుకున్న గౌరవాన్ని టీమిండియా హెడ్ కోచ్‌గా పోగొట్టుకోవడం ఇష్టం లేకనే ఆ పదవి తీసుకోలేదని వ్యాఖ్యానించాడు వీరూ...

click me!

Recommended Stories