విరాట్ కోహ్లీ వాటిని ఆరాధిస్తాడు, అందుకే భారత జట్టు ఈ పొజిషన్‌లో ఉంది... టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి...

First Published Dec 7, 2021, 2:49 PM IST

టెస్టు ఫార్మాట్‌లో గత ఐదేళ్లుగా నెం.1 టీమ్‌గా దూసుకుపోతోంది భారత జట్టు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి జట్లను వారి గడ్డపైనే చిత్తు చేసిన టీమిండియా... న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో సొంతం చేసుకుని, సౌతాఫ్రికా పర్యటనకు సిద్ధమవుతోంది...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2019-21 పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్‌గా నిలిచిన భారత జట్టు, అనేక పరిస్థితుల కారణంగా ఫైనల్ మ్యాచ్‌లో విజయాన్ని అందుకోలేకపోయింది...

ముంబై టెస్టులో న్యూజిలాండ్‌పై 372 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకున్న టీమిండియా, భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకుంది...

భారత జట్టు టెస్టుల్లో ఇంత పటిష్టంగా మారడానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిగిలిన ఫార్మాట్ల కంటే టెస్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, ఆరాధించడమే అంటున్నాడు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

‘గడిచిన ఐదేళ్లలో టెస్టు క్రికెట్‌కి ఏదైనా జట్టు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిందంటే అది కచ్ఛితంగా టీమిండియానే.. దానికి కారణం విరాట్ కోహ్లీయే...

విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌ను ఇష్టపడడం కాదు, ఆరాధిస్తాడు. జట్టును మరింత పటిష్టంగా తయారుచేయడానికి ఏం చేయాలా? అని నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు...

ఎవరైనా యంగ్ క్రికెటర్, దేశవాళీ టోర్నీల్లో కానీ, ఐపీఎల్‌లో కానీ మంచి పర్పామెన్స్ ఇస్తుంటే, అతన్ని టెస్టు ఫార్మాట్‌లో ఎలా వాడుకోవచ్చోనని ఆలోచిస్తాడు...

ఐపీఎల్‌తో పాటు, వన్డే, టీ20 క్రికెట్ ఎక్కువగా టీమిండియాలో ఏ ప్లేయర్‌ని అడిగినా, 99 శాతం మంది టెస్టు క్రికెట్ ఆడడానికే ఎక్కువ ఇష్టపడతామని చెబుతారు...

అందుకే భారత జట్టు టాప్ టీమ్‌గా మారింది. ప్రతీ ఏడాది టెస్టుల్లో టాప్ టీమ్‌గా ముగిస్తోంది... ’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ కోచ్ రవిశాస్త్రి...

‘డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో ఓడిపోయి ఉండొచ్చు, ఆ ఒక్క ఓటమిని పక్కనబెడితే గత ఐదేళ్లలో మనమే టెస్టు ఛాంపియన్‌షిప్ గదను గెలిచాం...

ఆస్ట్రేలియాలో గత రెండు పర్యటనల్లోనూ టెస్టు సిరీస్ గెలిచాం. ఇంగ్లాండ్‌తో మంచి ఆధిక్యం చూపించాం. ప్రపంచంలో ఎక్కడైనా గెలవగలమని నిరూపించుకున్నాం...

ముఖ్యంగా భారత ఫాస్ట్ బౌలర్లు టెస్టుల్లో వరల్డ్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తున్నారు. నేటి తరానికి గత తరాలు ఇచ్చిన గొప్ప వారసత్వ సంపద టెస్టు క్రికెటే... దాన్ని అందరూ గౌరవించడం గర్వంగా ఉంది...’ అంటూ చెప్పుకొచ్చాడు రవిశాస్త్రి...

స్వదేశంలో ఆడిన గత 14 టెస్టు సిరీస్‌ల్లో ఓటమి ఎరుగని భారత జట్టు, గత 8 ఏళ్లుగా భారత్‌లో ఆడిన మ్యాచుల్లో కేవలం రెండే రెండు టెస్టు మ్యాచుల్లో ఓడింది...

click me!