రాసి పెట్టుకోండి, కోహ్లీ ఓ భారీ సెంచరీతో మళ్లీ టాప్‌లోకి వస్తాడు... విరాట్ చిన్ననాటి కోచ్ కామెంట్...

First Published Aug 24, 2021, 1:31 PM IST

టీమిండియా ఫ్యాన్స్‌ను, ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న విషయం కెప్టెన్ ప్రస్తుత ఫామ్. రెండేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయిన విరాట్ కోహ్లీ, తన స్థాయికి తగిన పర్ఫామెన్స్ ఇచ్చి కూడా చాలా రోజులే అయ్యింది...

2019లో చివరిగా సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత రెండేళ్లుగా శతకాన్ని నమోదుచేయలేకపోయాడు. అదీకాకుండా టాప్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న విరాట్, వరుసగా పాయింట్లు కోల్పోతూ ర్యాంకులోనూ కిందకి దిగజారుతున్నాడు...

020 ప్రారంభంలో విరాట్ కోహ్లీ టెస్టు సగటు 54.30. మూడు ఫార్మాట్లలోనూ 50+ సగటు ఉన్న ఏకైక బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీయే... అయితే అప్పటి నుంచి విరాట్ పరుగులు చేయడంలో పడుతున్న ఇబ్బంది, అతని కెరీర్ యావరేజ్‌పై పడుతూ వస్తోంది...

గత 17 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ టెస్టు సగటు 54.30 నుంచి 51.41కి పడిపోయింది. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు 52.37 సగటుతో ఉన్నాడు విరాట్ కోహ్లీ...

అయితే తొలి టెస్టులో గోల్డెన్ డకౌట్ కావడం, ఆ తర్వాత రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసినా, రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే పెవిలియన్ చేరడంతో ఇవన్నీ అతని సగటుపై, ఐసీసీ ర్యాంకుపై ప్రభావం చూపించాయి...

‘నా దృష్టిలో కోహ్లీ క్లాస్ ముందు, అతని ఫామ్ చాలా టెంపరరీ. విరాట్‌కి ఎవరి సలహాలు, సూచనలు అవసరం లేదు. ఇప్పటికే 70 సెంచరీలు చేసిన కోహ్లీ... ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని ఎలా ఆడాలో బాగా తెలుసుకునే ఉంటాడు...

విరాట్ కోహ్లీతో లార్డ్ టెస్టు ముగిసిన తర్వాత ఫోన్‌లో మాట్లాడాను. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. అతను ఐదో ర్యాంకుకి పడిపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది...

అయితే త్వరలోనే కోహ్లీ బ్యాటు నుంచి ఓ భారీ సెంచరీ వస్తుంది. మళ్లీ అతను టాప్‌లోకి వస్తాడు. అందులో నాకు ఎలాంటి సందేహాలు లేవు... కోహ్లీ పరుగుల దాహం అలాంటిది...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ..

విరాట్ కోహ్లీ 71వ సెంచరీ కోసం ఎన్నో రోజులుగా ఆశగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ అభిమానులు. కోహ్లీ సెంచరీల మోత మోగించినప్పుడు హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలచడంలో ఇబ్బంది పడిన జో రూట్, ఇప్పుడు వరుసగా సెంచరీలు చేస్తున్నాడు...

టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కేన్ విలియంసన్ టాప్‌లో ఉంటే, జో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, లబుషేన్ మూడు, నాలుగు స్థానాల్లో ఉంటే విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు...

ఆరో స్థానంలో ఉన్న భారత ఓపెనర్ రోహిత్ శర్మకు, విరాట్ కోహ్లీ మధ్య ఉన్న పాయింట్ల తేడా 3 మాత్రమే. ఇంకో టెస్టులో లేదా ఇంకో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఫెయిల్ అయి, రోహిత్ శర్మ ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇస్తే... ‘హిట్ మ్యాన్’ టాప్ 5లోకి రావడం గ్యారెంటీ...

click me!