వన్డే కెప్టెన్సీ కోరుకున్న విరాట్, టెస్టుల నుంచి కూడా ఎందుకు తప్పుకున్నాడు... అసలు డ్రెస్సింగ్ రూమ్‌లో...

Published : Jan 16, 2022, 12:28 PM IST

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనేది విరాట్ కోహ్లీ స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం. అయితే ఏ ముహుర్తాన ఆ నిర్ణయం తీసుకున్నాడో కానీ విరాట్ కోహ్లీ కెరీర్‌ ఒక్కసారిగా తలకిందులైపోయింది. వన్డే కెప్టెన్సీ, ఆ తర్వాత టెస్టు కెప్టెన్‌గానూ తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ...

PREV
111
వన్డే కెప్టెన్సీ కోరుకున్న విరాట్, టెస్టుల నుంచి కూడా ఎందుకు తప్పుకున్నాడు... అసలు డ్రెస్సింగ్ రూమ్‌లో...

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కి రోహిత్ శర్మను కెప్టెన్‌గా ప్రకటిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టు తనకి గంటన్నర ముందు చెప్పారని ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో చెప్పాడు విరాట్ కోహ్లీ...

211

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత వన్డే, టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగుతానని ప్రకటించాడు విరాట్ కోహ్లీ. అయితే ఇది జరిగిన నాలుగు నెలలకే ఈ ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా వైదొలిగాడు...

311

వన్డే కెప్టెన్సీ కూడా కోరుకున్న విరాట్ కోహ్లీ, ఇప్పుడు టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడంటే... తెర వెనక జరుగుతున్న పరిణామాల గురించి సగటు క్రికెట్ అభిమాని అంచనా వేసుకోవచ్చు...

411

వన్డే, టెస్టుల్లో విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా తిరుగులేని రికార్డు ఉంది. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక విజయాల శాతం, టెస్టుల్లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ విరాట్ కోహ్లీయే...

511

ఆడిలైడ్‌ టెస్టులో టీమిండియా 36 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ, ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎంతో హుందాగా 45 నిమిషాల చెత్తాట కారణంగానే ఇలా జరిగిందంటూ కామెంట్ చేసి, పెటర్నిటీ లీవ్ మీద స్వదేశానికి వచ్చేశాడు...

611

అలాంటిది కేవలం ఒక్క టెస్టు ఓటమికే టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకుంటాడా? సెంచూరియన్‌ టెస్టులో విజయం అందుకుని, సౌతాఫ్రికా కంచుకోటను బద్ధలు కొట్టాడు విరాట్...

711

జోహన్‌బర్గ్ టెస్టులో విరాట్ కోహ్లీ బరిలో దిగి ఉంటే, మ్యాచ్ రిజల్ట్, సిరీస్ ఫలితం రెండూ మారిపోయేవి. కేప్‌ టౌన్ టెస్టులో బ్యాట్స్‌మెన్‌గా చేయాల్సిదంతా చేశాడు విరాట్ కోహ్లీ...

811

అలాంటిది సడెన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే డ్రెస్సింగ్ రూమ్‌లో ఏదో జరుగుతోందని, విరాట్ కోహ్లీని బీసీసీఐ కార్నర్ చేసి... కెప్టెన్సీ నుంచి తప్పుకునేలా చేసిందని ఆరోపిస్తున్నారు అభిమానులు...

911

ముఖ్యంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షాల రాజకీయాల కారణంగా విరాట్ కోహ్లీ... టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని ట్రోల్స్ వస్తున్నాయి...

1011

కేప్ టౌన్ టెస్టులో డీన్ ఎల్గర్ ఎల్బీడబ్ల్యూ డీఆర్‌ఎస్ వివాదం విషయంలో కోహ్లీ స్పందించిన తీరుపై బీసీసీఐ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అనుమానిస్తున్నారు ఫ్యాన్స్... 

1111

వన్డే వరల్డ్ కప్ 2023 దాకా వన్డే సారథిగా ఉండాలని భావించిన విరాట్ కోహ్లీ, టెస్టుల్లో మరికొంత కాలం సారథిగా కొనసాగాలని అనుకున్నాడు. కానీ అతని ప్రణాళికలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది బీసీసీఐ...

Read more Photos on
click me!

Recommended Stories