Virat Kohli: కోహ్లీ చెత్త రికార్డు.. డకౌట్‌తో ఆ జాబితాలో తొలి ఆటగాడిగా..

Published : Sep 07, 2022, 10:46 AM IST

Asia Cup 2022: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ  ఆసియా కప్ లో చెత్త రికార్డు నమోదుచేశాడు. వరుసగా మూడు మ్యాచుల్లో రాణించిన కోహ్లీ.. లంకతో మ్యాచ్ లో మాత్రం.. 

PREV
17
Virat Kohli: కోహ్లీ చెత్త రికార్డు..  డకౌట్‌తో ఆ జాబితాలో తొలి ఆటగాడిగా..

గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమై ఇటీవలే ఆసియా కప్ లో మూడు మ్యాచుల్లో మెరుగైన ప్రదర్శనలు చేసి  తిరిగి మునపటి లయను అందుకున్న టీమిండియా మాజీ సారథి శ్రీలంకతో మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. మధుశంక వేసిన 3వ ఓవర్ లో కోహ్లీ.. పరుగులేమీ చేయకుండానే   క్లీన్ బౌల్డ్ అయి నిరాశపరిచాడు. 

27
Image credit: Getty

ఈ మ్యాచ్ లో డకౌట్ అవడం ద్వారా విరాట్ కోహ్లీ  తన పేరిట అనవసర రికార్డును నమోదుచేసుకున్నాడు.   ఆసియా కప్ వన్డే, టీ20 ఫార్మాట్ లలో డకౌటైన తొలి ఆటగాడిగా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

37

లంకతో మ్యాచ్ లో కెఎల్ రాహుల్ ఆరు పరుగులే చేసి  దురదృష్టవశాత్తు ఔటయ్యాడు. ఆ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీ మీద భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ కోహ్లీ మాత్రం మధుశంక వేసిన ఇన్స్వింగర్ కు  క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు.  

47

ఇక ఈ చెత్త రికార్డుతో పాటు భారత జట్టు తరఫున అత్యధికంగా డకౌట్ అయిన బ్యాటర్లలో కోహ్లీ ఆరోస్థానంలోకి వచ్చాడు.   ప్రస్తుతం కోహ్లీ  మొత్తంగా తన కెరీర్ లో 34 సార్లు డకౌట్ అయ్యాడు. సచిన్ కూడా  34 సార్లు పరుగులేమీ చేయకుండానే నిష్క్రమించాడు.  

57

ఓవరాల్‌గా భారత జట్టు తరుపున అత్యధిక సార్లు డకౌట్ అయిన ప్లేయర్‌ల జాబితా చూస్తే.. జహీర్ ఖాన్ 44 సార్లు, ఇషాంత్ శర్మ 40 సార్లు, హర్భజన్ సింగ్ 37, అనిల్ కుంబ్లే 35, సచిన్ టెండూల్కర్ 34 సార్లు డకౌట్ అయ్యి... విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు. ఇప్పుడు కోహ్లీ  సచిన్ తో సమానంగా నిలిచాడు. 
 

67

ఇక మంగళవారం నాటి భారత్-శ్రీలంక మ్యాచ్ లో  లంక 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సూపర్-4లో భాగంగా  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.  భారత జట్టు తరఫున రోహిత్ శర్మ (72) రాణించాడు. 

77

అనంతరం  శ్రీలంక.. 19.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 174 పరుగులు చేసింది. ఆ జట్టులో  ఓపెనర్ పథుమ్ నిస్సంక (52), కుశాల్ మెండిస్ (57) రాణించారు. చివర్లో భానుక రాజపక్స, ధసున్ శనక లు మెరుపులు మెరిపించి లంకకు విజయాన్ని అందించారు. ఈ విజయంతో లంక ఆసియా కప్ లో ఫైనల్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. 

Read more Photos on
click me!

Recommended Stories