టీమిండియాకి మరో షాక్... ఆసియా కప్ 2022 టోర్నీ నుంచి ఆవేశ్ ఖాన్ అవుట్... దూరమయ్యాడా? తప్పించారా!

Published : Sep 06, 2022, 09:56 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీలో భారత జట్టును ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ లేకుండా ఆసియా కప్ 2022 టోర్నీకి మొదలెట్టిన భారత జట్టుకి రవీంద్ర జడేజా గాయంతో ఇంకో షాక్ తగలింది. తాజాగా యంగ్ పేసర్ ఆవేశ్ ఖాన్ కూడా ఈ టోర్నీకి దూరమయ్యాడు...

PREV
16
టీమిండియాకి మరో షాక్... ఆసియా కప్ 2022 టోర్నీ నుంచి ఆవేశ్ ఖాన్ అవుట్... దూరమయ్యాడా? తప్పించారా!

మొదటి రెండు మ్యాచుల్లో ఆకట్టుకున్న రవీంద్ర జడేజా.. మోకాలి గాయంతో ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమయ్యాడు. జడ్డూ టీ20 వరల్డ్ కప్ 2022 సమయానికి అయినా కోలుకుంటాడా? అనేది అనుమానంగా మారింది...

26
Image credit: PTI

జ్వరంతో పాకిస్తాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌కి దూరంగా ఉన్న యంగ్ పేసర్ ఆవేశ్ ఖాన్, ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ బరిలో దిగలేదు. అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆసియా కప్ 2022 టోర్నీ మొత్తానికి దూరమైనట్టు సమాచారం...

36
Image credit: PTI

ఆవేశ్ ఖాన్ స్థానంలో దీపక్ చాహార్‌ని జట్టులోకి తీసుకుంది టీమిండియా. ఆవేశ్ ఖాన్, ఆసియా కప్ 2022 టోర్నీలో ఆడిన మొదటి రెండు మ్యాచుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. భారీగా పరుగులు సమర్పించాడు...

46
Image credit: PTI

దీంతో జ్వరం వంకతో ఆవేశ్ ఖాన్‌ని ఆసియా కప్ టోర్నీ నుంచి టీమిండియా కావాలనే తప్పించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అతని కంటే మెరుగైన బౌలర్ దీపక్ చాహార్‌ని తుదిజట్టులోకి తీసుకురావడానికే ఆవేశ్ ఖాన్‌కి అనారోగ్యం వంకను వాడిందని క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు..

56
Image credit: Getty

దీపక్ చాహార్ ఇప్పటిదాకా 20 టీ20 మ్యాచులు ఆడి 26 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌పై 7 పరుగులకే 6 వికెట్లు తీసి పురుషుల టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన దీపక్ చాహార్, టీమిండియా తరుపున టీ20ల్లో మొట్టమొదటి హ్యాట్రిక్, ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు...

66
Deepak Chahar

ఆవేశ్ ఖాన్ కంటే దీపక్ చాహార్‌ బ్యాటింగ్ కూడా చేయగలడు. డెత్ ఓవర్లలో భారీ షాట్లు ఆడుతూ విలువైన పరుగులు రాబట్టగలడు. దీంతో దీపక్ చాహార్‌ని టీమ్‌లోకి తీసుకోవడానికి టీమిండియా మేనేజ్‌మెంట్, ఆవేశ్ ఖాన్‌ని బలి పశువుగా చేసిందని మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

click me!

Recommended Stories